Homeఆంధ్రప్రదేశ్‌YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు క్లోజ్

YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు క్లోజ్

YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య. దేశంలోనే హై ప్రొఫైల్ కేసు ఇది. ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది ఈ కేసు. తొలుత రాజకీయ ప్రత్యర్థులు ఈ పని చేశారని అప్పట్లో నమ్మించారు. ఎవరైతే ఇలాంటి ప్రకటనలు చేశారో.. వారి వెంట ఉన్న వారి అసలు నిందితులు అయ్యారు. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తేలిపోయింది. కేవలం రాజకీయ, ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని […]

YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య. దేశంలోనే హై ప్రొఫైల్ కేసు ఇది. ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది ఈ కేసు. తొలుత రాజకీయ ప్రత్యర్థులు ఈ పని చేశారని అప్పట్లో నమ్మించారు. ఎవరైతే ఇలాంటి ప్రకటనలు చేశారో.. వారి వెంట ఉన్న వారి అసలు నిందితులు అయ్యారు. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తేలిపోయింది. కేవలం రాజకీయ, ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని తేలింది. అయితే వివేక కుమార్తె సునీత మాత్రం పెద్దల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ ఇప్పటివరకు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమె పోరాటంతోనే వివేకా హత్య కేసు విచారణ మళ్లీ ప్రారంభించింది సిబిఐ. కానీ ఒకరిద్దరూ పాత్ర పై విచారణ చేపట్టి.. ఇంతటితో ఇది సమాప్తం అని.. ఇతర వ్యక్తుల ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లభించలేదని తేల్చేసింది. తుది చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంతో వివేకా హత్య కేసు విచారణ ఎక్కడ ముగిసిందో.. నిందితులు ఇంతేనని గతంలో సిబిఐ తేల్చిందో.. అదే వివరాలను ఇప్పుడు తుది చార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

* అనేక మలుపులు తిరుగుతూ..
2019 మార్చి 15న దారుణంగా హత్యకు గురయ్యారు వైయస్ వివేకానంద రెడ్డి. ఆయన రాజశేఖర్ రెడ్డి కి ( y s Rajasekhar Reddy )స్వయానా సోదరుడు. జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. అయితే తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. తరువాత హత్యగా పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సొంత మీడియాలో రాసుకున్నారు. అలా ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు అంశం చాలా సానుభూతి ఇచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహద పడింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు చిత్రాలు బయటకు వచ్చాయి. ఇది ఎంత మాత్రం రాజకీయ ప్రతీకార హత్య కాదని తేలిపోయింది. కుటుంబ సభ్యులకు ప్రమేయంతో వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలతోనే జరిగిందని బయటకు వచ్చింది. అయితే ఇందులో కుటుంబ పెద్దల పాత్ర ఉందని అనుమానిస్తూ సునీత న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు. కానీ అప్పట్లో కేసు విచారణకు అవసరమైన సాక్షాలను తొలగించారు. కేసు పై రాజకీయ ప్రమేయం విపరీతంగా పనిచేసింది. కేసు మూలాలను చిదిమేశారు.

* కొత్త వ్యక్తుల ప్రస్తావన లేదు..
ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రానికి వచ్చి విచారణ చేపడితే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో చివరకు దర్యాప్తు అధికారులను సైతం బెదిరించే పరిస్థితి వచ్చింది. ఏకంగా కేసు విచారణ చేపడుతున్న సిబిఐ అధికారి పైనే కోర్టుకు వెళ్లారు అంటే ఏ స్థాయిలో తొక్కి పెట్టాలి ఆ స్థాయిలో తొక్కిపెట్టారు. సాక్షాలు చెరిపేశారు. ఆనవాళ్లు లేకుండా చేశారు. దర్యాప్తు అధికారులను బెదిరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహకారం లేదు. ఇలా ఐదేళ్లపాటు వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఎటువంటి స్థాయిలో జరిగి ఉంటుందో అర్థం అవుతుంది. అయితే ఈ కేసులో వివేకా కుమార్తె సునీత.. బయట ప్రపంచానికి తెలియక ముందే కీలక పెద్దలకు వివేక హత్య కేసు విషయం ఎలా తెలిసింది అనే పాయింట్ పట్టుకొని పోరాడారు. కానీ ఆమె మాట నిలబడలేదు న్యాయస్థానంలో. అంతస్థాయిలో పెద్దల విచారణ అవసరం లేదన్నట్టు కోర్టు అభిప్రాయపడింది. అందుకే తాజాగా ఒకరిద్దరిని విచారించి.. ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించింది. ఇంతవరకు సిబిఐ చూపిన నిందితులే అన్నట్టు మారింది. సునీత అనుమానిస్తున్నట్లు అసలు నిందితుల ప్రస్తావన లేదు. వారి పాత్ర పై ఎటువంటి చార్జ్ షీట్ దాఖలు చేయలేదు. దీంతో వివేక హత్య కేసు ఇక ముగింపు పలకాల్సిందేనన్న సంకేతం వచ్చింది. మరి దీనిపై వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper