Homeఅంతర్జాతీయంBangladesh Diplomatic Ties With India: బంగ్లాదేశ్‌ స్నేహగీతం.. భారత్‌తో సత్సంబంధాలకు యత్నం..!

Bangladesh Diplomatic Ties With India: బంగ్లాదేశ్‌ స్నేహగీతం.. భారత్‌తో సత్సంబంధాలకు యత్నం..!

Bangladesh Diplomatic Ties With India: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మారుతున్నాయి. భారత వ్యతిరేకత క్రమంగా తగ్గుతోంది. భారత్‌తో సఖ్యతగా ఉంటూ కలిసి పనిచేయకుంటే ఇబ్బందని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహ్మద్‌ యూనస్‌ పాలించిన 18 నెలల పాలన నెమ్మదిగా మారుతోంది. బంగ్లాదేశ్‌ అంతర్గత అవసరాలు, గల్ప్‌ యుద్ధం వల్ల కలిగిన పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్‌లో మార్పు కనిపనిస్తోంది. Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా? భారత–బంగ్లా చర్చలు […]

Bangladesh Diplomatic Ties With India: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మారుతున్నాయి. భారత వ్యతిరేకత క్రమంగా తగ్గుతోంది. భారత్‌తో సఖ్యతగా ఉంటూ కలిసి పనిచేయకుంటే ఇబ్బందని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహ్మద్‌ యూనస్‌ పాలించిన 18 నెలల పాలన నెమ్మదిగా మారుతోంది. బంగ్లాదేశ్‌ అంతర్గత అవసరాలు, గల్ప్‌ యుద్ధం వల్ల కలిగిన పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్‌లో మార్పు కనిపనిస్తోంది.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

భారత–బంగ్లా చర్చలు
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఇంటలిజెన్స్‌ మేజర్‌ జనరల్‌ కైసర్‌ రసూల్‌ చౌదరి హఫీజు ఉర్‌ రహ్మాన్‌ ఇటీవల భారత్‌కు వచ్చి రా చీఫ్‌ పరాగ్‌ జైన్, లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ రమణ్‌లతో సమావేశమయ్యారు. చర్చల వివరాలు బయటపడలేదు. ఇది రక్షణ, ఇన్‌టెలిజెన్స్‌ సహకారానికి సూచిక.

ఆర్మీ, పోలీసు విభాగాల్లో సంస్కరణలు
బంగ్లా ఆర్మీలో జమాతే ఇస్లామ్‌ ప్రభావాన్ని తొలగించేందుకు యూనస్‌ అనుకూలులను రిటైర్‌ చేశారు. పోలీస్‌ విభాగాన్ని పునరుద్ధరిస్తున్నారు. జమాత్‌ అల్లర్లలో 3,500 మంది పోలీసుల సజీవ దహనానికి విచారణ జరుగనుంది. దీంతో మహ్మద్‌ యూనిస్, జమాతే ఇస్లామ్‌ అనుకూలులు ఆందోళన చెందుతున్నారు.

యాంటీ ఇండియా చర్యలు తగ్గుదల
ఐఎస్‌ఐ ఏజెంట్ల చొరబాటు, హిందువులపై దాడులు తగ్గుతున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ క్రమబద్ధీకరణకు చర్యలు. ఉస్మాన్‌ హాదీ హత్య కారకులు బెంగాల్‌లో పట్టుబడ్డారు. వారిని భారత్‌ బంగ్లాదేశ్‌కు అప్పగించింది. ఈ హత్య వెనుక మహ్మద్‌యూనస్‌ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయడానికి ఈ హత్య చేయించినట్లు సమాచారం.

గల్ఫ్‌ యుద్ధ ప్రభావం
గల్ఫ్‌ యుద్ధం చమురు సరఫరాను ఆపేసింది. ఆర్మూజ్‌ జలసంధి మూసుకుపోయింది. బంగ్లాదేశ్‌లో చమురు నిల్వలు అడుగంటాయి. దీంతో దిక్కుతోచని స్థితి నెలకొంఆది. దీంతో బంగ్లాదేశ్‌ 1.8 లక్షల టన్నుల డీజిల్‌ సహాయం భారత్‌ను కోరింది. గల్ఫ్‌లో పనిచేసే బంగ్లాదేశీయుల డబ్బు ఆగిపోయింది.

కొత్త ప్రభుత్వం భారత్‌తో సఖ్యతే మంచిదని భావిస్తోంది. పాక్‌ అనుకూల ఎలిమెంట్స్‌ ఏర్పడే అవకాశం. యూనస్‌ తప్పుల సరిదిద్దేందుకు చర్యలు. ఆర్థిక సహాయం, రక్షణ సహకారంతో రిలేషన్స్‌ మెరుగుపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper