Homeఅంతర్జాతీయంGulf War Pakistan Economic Crisis: గల్ఫ్ యుద్ధం : పాక్ చావుకొచ్చిది.. దెబ్బకు ఆ...

Gulf War Pakistan Economic Crisis: గల్ఫ్ యుద్ధం : పాక్ చావుకొచ్చిది.. దెబ్బకు ఆ పనిచేస్తోంది…

Gulf War Pakistan Economic Crisis: మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా మారింది పాకిస్తాన్‌ పరిస్థితి. పది రోజుల గల్ఫ్‌ యుద్ధంతో పాకిస్తాన్‌ ఆర్థిక క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యాసంస్థలకు రెండు వారాల సెలవులు ప్రకటించారు. దీంతో ఇంధన వినియోగం తగ్గుతుందని భావించారు. ఆఫీసులు వారానికి నలుగు రోజులకు తగ్గించారు. దీంతో కూడా ఇంధనం పొదుపు అవుతుందని భావించారు. వర్క్‌ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేసింది. రవాణాపై నియంత్రణ విధించింది. ఉద్యోగులకు రెండు నెలలు జీతాలు రావని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. కొందరికి ఆలస్యంగా ఇస్తామని తెలిపారు.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

ఇంధనం, జీతాల పొదుపు
షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటనల ప్రకారం ఉద్యోగులకు రెండు నెలలు జీతాలు ఆలస్యం, నెలకు రెండు రోజుల వేతన కోత పేదలకు పంపనున్నారు. బహిరంగ కార్యక్రమాలు, ఇఫ్తార్‌లు ఆపేశారు. పెట్రోల్‌ ధర రూ.65 పెంచడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

ఐఎంఎఫ్‌ కండీషన్లు
ఈ చర్యలు గల్ఫ్‌ యుద్ధం కంటే ఐఎంఎఫ్‌ రుణ షరతుల అమలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఐఎంఎఫ్‌ 24 సార్లు రుణాలు ఇచ్చి పన్నులు, సబ్సిడీల కోతలు విధించింది. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కఠిన చర్యలు తప్పనిసరి. దీంతో పాకిస్తాన్‌ ఇప్పుడు వాటిని అమలు చేస్తోంది.

యుద్ధాలు కొనసాగింపు..
ఆర్థిక క్రమశిక్షణ అమలు చేస్తూనే ఖైబర్‌ఫఖ్తూంగ్వా, బలూచిస్తాన్‌పై మాత్రం దాడులు కొనసాగిస్తోంది. ఇక ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధం చేస్తోంది. మరోవైపు భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే పనులు కొనసాగిస్తోంది. ఇటీవల రజౌరీ ద్వారా భారత్‌లో ఉగ్రవాదుల పంపే ప్రయత్నం చేసింది. దీనిని సైన్యం అడ్డుకుంది. యుద్ధాల పేరుతో డబ్బు వృథా చేస్తూ ప్రజలపై ఒత్తిడి పెంచుతోంది.

గల్ఫ్‌ యుద్ధాన్ని మూలంగా చూపి ఐఎంఎఫ్‌ కండీషన్లు, పన్ను పెంపులు అమలు చేస్తోంది. ఇది పేదలపై భారం పెంచుతూ అసంతృప్తిని రేకెత్తిస్తుంది. ఆర్థిక సంక్షోభం దీర్ఘకాలంలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఈ చర్యలు తాత్కాలిక పొదుపు కల్పిస్తాయి కానీ స్థిర సామాన్యత లేకుండా ప్రజల అసహనం పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular