Xiaomi Power Bank: ఫోన్లు ఎంత ముఖ్యమో.. ఏదైనా అత్యవసరమైన పని ఉన్నప్పుడు.. చార్జర్ మర్చిపోయినప్పుడు పవర్ బ్యాంకు కూడా వెంట ఉండడం అంత అవసరం. ఒకప్పుడు పవర్ బ్యాంకులు చాలా బరువుగా.. కాస్త విస్తారమైన పరిమాణంలో ఉండేవి. కానీ ఇప్పుడు పవర్ బ్యాంకులు కూడా ఫోన్ల కంటే నాజుకుగా తయారవుతున్నాయి
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమి సరికొత్త పవర్ బ్యాంకు ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ పవర్ బ్యాంకు 20,000 ఎంఏహెచ్, 165 డబ్ల్యూ సామర్ధ్యంతో మార్కెట్లోకి వచ్చేసింది. సెప్టెంబర్ 8న మనదేశంలో ఇది విడుదల కాబోతోంది. లాప్టాప్ లు.. మ్యాక్ బుక్.. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల వంటి వాటిని వేగవంతంగా చార్జింగ్ చేయడానికి దీనిని రూపొందించారు.
ఈ పవర్ బ్యాంకును విమాన ప్రయాణంలోనూ సురక్షితంగా తీసుకెళ్లవచ్చు. పైగా ఇందులో 20000 ఎం ఏ హెచ్ సామర్థ్యం ఉండడం.. 70.56 డబ్ల్యూహెచ్ పవర్ రేటింగ్ ఉండటం వల్ల విమానాశ్రయ భద్రతా తనిఖీలను సులభంగా దాటవచ్చు.
ఇందులో బ్రెయిడెడ్ యుఎస్బి టైపు సి కేబుల్ ఉంది. అందువల్ల అదనపు కేబుల్స్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు .
ఇది స్మార్ట్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. ఖచ్చితమైన బ్యాటరీ శాతం.. యాక్టివ్ పోర్ట్ స్థితి.. పవర్ అవుట్ పుట్ వోల్టేజ్.. డిశ్చార్జ్ టైం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది..
ఇందులో క్వాల్ కాం క్విక్ చార్జ్.. ఇంటెలిజెంట్ అడాప్టివ్ ఛార్జింగ్.. మెయిన్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఉష్ణోగ్రత పెరగడం లేదా ఓవర్ చార్జింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి వాటి నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది
ఈనెల 8 నుంచి భారత మార్కెట్లోకి విడుదలవుతున్నప్పటికీ.. షావోమి కంపెనీ దీనిని రిటైల్ ధర నిర్ణయించలేదు. ఎంఐ ఇండియా స్టోర్.. ప్రధాన ఆన్లైన్ మార్కెట్ వేదికలలో ఇది లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రకారం దీని ధర దాదాపు 40 డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.