spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vulgar language trend in Telugu: బూతే.. బ్రహ్మాండం.. మహాదానందం.. ఈ నోటి డ్రైనేజీ కంపు.....

Vulgar language trend in Telugu: బూతే.. బ్రహ్మాండం.. మహాదానందం.. ఈ నోటి డ్రైనేజీ కంపు.. ఎందుకింత ఇంపు?

Vulgar language trend in Telugu: మనం మాట్లాడే మాటలు బాగుండాలి. వినసొంపుగా ఉండాలి. చెవులకు ఇంపుగా ఉండాలి. అప్పుడే మాటలకు విలువ ఉంటుంది. మాట్లాడే వారికి సమాజంలో గౌరవం ఉంటుంది.

ఇటీవల కాలంలో మనుషులు మాట్లాడే మాటల్లో తేడా వచ్చేసింది. సుభాషితాలు కాస్త బూతు మాటలుగా మారిపోయాయి. అడ్డగోలుగా ద్వంద్వ అర్ధాలు గోచరిస్తున్నాయి. వినకూడని మాటలు యదాలాపంగా వచ్చేస్తున్నాయి. సినిమాల హీరోలనుంచి మొదలుపెడితే రాజకీయ నాయకుల వరకు ఎవరూ తగ్గడం లేదు.

బూతులు అదే పనిగా వ్యాప్తిలో ఉండడంతో చిన్నపిల్లలు కూడా బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నారు.. ఫ* , గుంజిగుంజి ***, కుర్చి మడతపెట్టి *** వంటి మాటలు కాదు పాటలు ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా వ్యాప్తిలోకి వచ్చేసాయి. పాటలంటే ఇవా.. ఇవా పాట కోసం ఉపయోగించే పదాలు
. ఎవరు నేర్పిన భాష ఇది.. ఎవరు రుద్దుతున్న బూతు ఇది.. సమాజం ఏమైపోతుంది.. పిల్లల మీద అది ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందనే ఇంగితం సినిమా వాళ్లకు లేకపోవడం దారుణం.

ఇక రాజకీయ నాయకులు భాష విషయానికి వస్తే బూతులు దర్జాగా ప్రవహిస్తున్నాయి. పొట్టోడా.. లంగా.. హౌలే.. బట్టలిప్పి కొడతా.. ఇంకా రాయడానికి వీలు లేని భాషలో నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుపెడితే గల్లిస్తాయి నాయకుల వరకు అందరూ బూతునే వేదమంత్రంగా మార్చుకున్నారు. దీనివల్ల పొందే ప్రయోజనం ఏమిటో రాజకీయ నాయకులే చెప్పాలి.

బూతులకు బూస్టింగ్ ఇవ్వడం.. రోత కు రోస్టింగ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. రాజకీయ నాయకుల నుంచి మొదలుపెడితే సినిమా తారల వరకు నోరు తెరిస్తే చాలు అడ్డగోలుగా బూతులు వస్తూనే ఉన్నాయి. మన ఇంటి పక్కనే ఉన్న మురుగు నీటి కంపును భరించగలం. కానీ, నోటి నుంచి వచ్చే బూతు కంపును తట్టుకోలేం. ఇటీవల కాలంలో ఎవరు ఎంత గొప్పగా బూతులు మాట్లాడితే.. ఆ స్థాయిలో ఫేమస్ అవుతామని భావిస్తున్నారు. దానికి నిదర్శనమే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ మాట్లాడిన రేయ్ అమిత్.. ఆ తర్వాత ఇటీవల ఈటీవీ ప్రభాకర్ చంద్రహాస్ పాడిన గుంజిగుంజి.. ఇవి ఉదాహరణలు మాత్రమే..

సినిమా తారలు.. రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కనిపించే రీల్స్ రూపొందించే వారు కూడా బూతులను దర్జాగా వాడుతున్నారు. నీ అయ్య.. నీ అమ్మ నుంచి మొదలు పెడితే రాయడానికి వీలు లేని భాషలో రీల్స్ రూపొందిస్తున్నారు. ఇలా మన భాష మీద బూతులు దర్జాగా దాడి చేస్తుంటే.. అసలు మాటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నేటితరం బూతులనే సుభాషితాలుగా మాట్లాడుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం మనమే. కన్నెపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి.. లేదా కడుపు అయినా చేయాలి.. కుర్చీని మడత పెట్టాలి.. అనే పదాలు పాటలుగా మారిపోయిన నేటి కాలంలో బూతు అనేది భవిష్యత్తు అయిపోయింది. ఇప్పటికైనా సమాజం మారకపోతే.. మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త పాటించకపోతే మొహమాటం లేకుండా బూతు ధ్వనిస్తుంది. బూతు మాత్రమే భవిష్యత్తు అవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper