Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam Boat Accident: 9 గంటలు సముద్రాన్ని ఈది బతికాడు.. మత్స్యకారుడి అద్భుత పోరాటం

Visakhapatnam Boat Accident: 9 గంటలు సముద్రాన్ని ఈది బతికాడు.. మత్స్యకారుడి అద్భుత పోరాటం

Visakhapatnam Boat Accident: తన వెంట వచ్చిన వారు ఒక్కొక్కరు మునిగిపోతూ వస్తున్నారు.. ఆ సమయంలో కుటుంబం గుర్తుకు వచ్చింది.. బతకాలన్న ఆశ పుట్టింది.. అందుకే తొమ్మిది గంటలపాటు సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి మృత్యుంజయుడుగా నిలిచాడు ఆ మత్స్యకారుడు. విశాఖ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరిన పడవ తీరానికి వస్తుండగా మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మత్స్యకారులు బాధితులుగా మిగలగా.. కార్ ఇచ్చిన అనే మత్స్యకారుడు మృత్యుంజయుడుగా నిలిచాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ […]

Visakhapatnam Boat Accident: తన వెంట వచ్చిన వారు ఒక్కొక్కరు మునిగిపోతూ వస్తున్నారు.. ఆ సమయంలో కుటుంబం గుర్తుకు వచ్చింది.. బతకాలన్న ఆశ పుట్టింది.. అందుకే తొమ్మిది గంటలపాటు సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి మృత్యుంజయుడుగా నిలిచాడు ఆ మత్స్యకారుడు. విశాఖ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరిన పడవ తీరానికి వస్తుండగా మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మత్స్యకారులు బాధితులుగా మిగలగా.. కార్ ఇచ్చిన అనే మత్స్యకారుడు మృత్యుంజయుడుగా నిలిచాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ మర్చంట్ నౌకా సిబ్బంది అతనిని రక్షించగా.. ప్రస్తుతం విశాఖ షీలానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పృహలోకి వచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎలా బయటపడ్డాడో వివరించాడు.

* వాతావరణ ప్రతికూలతతో..
ఈనెల 1న ఏడుగురు మత్స్యకారులు ఒక బోటులో విశాఖ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరారు. ఇంతలో వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తిరిగి తీరానికి వచ్చేయాలని బయలుదేరారు. ఈనెల 4న మధ్యాహ్నం సమయంలో తీరానికి దాదాపు పది నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఓ భారీ అలా ఆ బోటును తాకింది. ఒక్కసారిగా బోటు తిరగబడింది. అందులో ఉన్న మొబైల్స్ తో పాటు ఇతర సామాన్లు కనిపించలేదు. తిరగబడ్డ బోటును పట్టుకొని మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు వేలాడుతూ వారంతా ఉండి పోయారు. ఎంతలో మరో అలా తాకడంతో పూర్తిగా ఆ బోటు మునిగిపోయింది. దీంతో అందరూ చనిపోతామని ఒక నిర్ణయానికి వచ్చారు.

* పెద్దన్నయ్య మాటలతో..
అయితే కారి చిన్న పెద్దన్నయ్య ఒకరు ఆ బృందంలో ఉన్నారు. అవకాశం ఉన్న వరకు ఈదుకొని వెళ్ళండి.. ఏదో ఒక బోటు.. భారీ నౌక కనిపిస్తుంది.. వారి సాయంతో బ్రతకొచ్చు. నేను మాత్రం రాలేను అంటూ ఆయన కళ్ళెదుటే మునిగిపోయినట్లు చిన్ని చెబుతున్నారు. ఆయన అన్న కుమారుడు ప్రారంభం నుంచి కనబడలేదు. దీంతో మిగిలిన ఐదుగురు గుండె ధైర్యంతో ఈదడం ప్రారంభించారు. కానీ క్రమేపి ఆ ఐదుగురు కూడా కనిపించలేదు. దీంతో చిన్ని తొమ్మిది గంటలపాటు సముద్రంలో ఈదుతూ ముందుకు సాగాడు. వాతావరణం సరిగా లేక దారిలో ఏ ఒక్క బోటు కూడా కనిపించలేదు. అలా ఈదుతూ రక్షించే వారి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆయన వెంట ఈదుతూ వస్తున్న నలుగురు కూడా కనిపించకుండా మానేశారు. గంటల తరబడి ఈదడంతో చిన్న కు నీరసం వచ్చింది. కానీ తన కుటుంబం గుర్తుకు రావడంతో ముందుకు సాగుతుండగా ఓ మర్చంట్ నావి నౌక కనిపించింది. అక్కడి సిబ్బంది చూసి కాపాడారు. నౌకలో చేరాక చిన్ని స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్చడంతో కొంత తేరుకున్నాడు. తన తోటి వారిని తలచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అందరిదీ పేద కుటుంబాలని.. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper