Homeఆంధ్రప్రదేశ్‌Vijay Sai Reddy : సంచలన ప్రెస్ మీట్.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. ఏపీ రాజకీయాల్లో...

Vijay Sai Reddy : సంచలన ప్రెస్ మీట్.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..

Vijay Sai Reddy :ఏపీ రాజకీయాలలో సంచలనం. మొన్నటిదాకా వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి.. సోమవారం కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడబోతున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అనేక విషయాలపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఏపీ రాజకీయాలలో సరికొత్త శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. వైసిపి నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులపాటు ఆయన […]

Vijay Sai Reddy :ఏపీ రాజకీయాలలో సంచలనం. మొన్నటిదాకా వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి.. సోమవారం కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడబోతున్నారు.

వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అనేక విషయాలపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఏపీ రాజకీయాలలో సరికొత్త శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. వైసిపి నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులపాటు ఆయన వ్యవసాయం చేశారు. ఆ తర్వాత బిజెపి పెద్దలతో టచ్లోకి వెళ్లారు. ఏం జరిగిందో తెలియదు.. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాల గురించి విజయసాయిరెడ్డి బయటపెట్టారు. మద్యం కుంభకోణంలో జరిగిన వ్యవహారాల గురించి కీలకమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన దాడిని కూడా ఇటీవల విజయసాయిరెడ్డి గుర్తు చేసుకున్నారు. విజయ సాయి రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన కచ్చితంగా రాజకీయ పార్టీ పెడతారని అందరూ అంచనా వేస్తున్నారు. పైగా ఒక హోటల్లో ఆయన ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఏపీలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారే అవకాశం ఉంది. పైగా ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయాల సాగుతున్నాయి. ఇందులో విజయసాయి రెడ్డికి ఎంత స్పేస్ ఉంటుందన్నది చూడాలి.

విజయసాయిరెడ్డి మాస్టర్ మైండ్. తెర వెనుక విషయాలను ఈజీగా టాకిల్ చేయగలరు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు.. ఇతర వ్యవహారాలను అప్పట్లో విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. తల పండిన ఆర్థికవేత్తగా విజయసాయి రెడ్డికి పేరు ఉంది. పైగా వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎంపీగా పని చేశారు. వైసిపిలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే విజయసాయిరెడ్డి ఎటువంటి పాత్ర పోషిస్తారు.. ఏపీ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతారు అన్నది చూడాలి. ఇప్పటికే ఏపీలో రెడ్డి సామాజిక వర్గం చాలావరకు వైసీపీకి అనుకూలంగా ఉంది. విజయసాయిరెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి.. ఒకవేళ ఆయన రెడ్డి సామాజిక వర్గంలోని నాయకులను ప్రభావితం చేయగలిగితే.. అప్పుడు వైసిపి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper