Homeఆంధ్రప్రదేశ్‌Janasena sacrifice for state: విజయ్ అధికారం కోసం.. పవన్ రాష్ట్రం కోసం.. ఇచ్చి పడేసిన...

Janasena sacrifice for state: విజయ్ అధికారం కోసం.. పవన్ రాష్ట్రం కోసం.. ఇచ్చి పడేసిన జనసేన

Janasena sacrifice for state: తమిళనాడు ఎన్నికల్లో సినిమా హీరో విజయ్ సత్తా చాటారు. తొలి ప్రయత్నం లోనే రెండు ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి 108 స్థానాల్లో విజయం సాధించారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా తన టీవీకేను నిలిపారు. సీఎం పీఠానికి కూత వేటు దూరంలో ఉండిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తగినంత మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం విజయ్ ను ఆహ్వానించలేదు. అయితే తమిళనాడు రాజకీయాలను […]

Janasena sacrifice for state: తమిళనాడు ఎన్నికల్లో సినిమా హీరో విజయ్ సత్తా చాటారు. తొలి ప్రయత్నం లోనే రెండు ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి 108 స్థానాల్లో విజయం సాధించారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా తన టీవీకేను నిలిపారు. సీఎం పీఠానికి కూత వేటు దూరంలో ఉండిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తగినంత మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం విజయ్ ను ఆహ్వానించలేదు. అయితే తమిళనాడు రాజకీయాలను ఏపీతో ఆపాదిస్తున్నారు కొందరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎన్నికల ప్రచారంలో విజయ్ వాడారని.. వారిద్దరూ ప్రాణ స్నేహితులు అంటూ చెబుతున్నారు. తమిళనాడు విజయ్ విజయంతో ఎలివేషన్లు ఇచ్చుకునే పనిలో ఉన్నారు. పనిలో పనిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.

విజయ్ గ్రేట్ అన్నట్టు..
దేశంలో ఏ మూల ఏది జరిగిన పవన్ కళ్యాణ్ ను ఆపాదించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విద్య. అందులో భాగంగా పవన్ కంటే విజయ్ గ్రేట్ అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సింగిల్ గా నిలబడి విజయ్ జగన్ మాదిరిగా తమిళనాడులో ప్రతాపం చూపారని ప్రచారం మొదలుపెట్టారు. మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ ఎక్కడ.. సింగిల్ గానే పోటీ చేసి రెండు పార్టీలను వెనక్కి నెట్టిన విజయ్ ఎక్కడ అంటూ పోలిక పెట్టడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయిన జనసేన సైనికులు సంయమనం పాటించారు. చాలా కూల్ గా ఉన్నారు.

విపక్షాలతో కలవడంతో..
అయితే మెజారిటీకి కూత వేటు దూరంలో ఉన్న విజయ్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో విజయ్ బలం 113 కు చేరుకుంది. అయినా ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు కావాలి. వారికోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసైనికులు స్పందించారు. విజయ్ పొత్తు పెట్టుకోరు.. కానీ అధికారం కోసం మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు. ఆయన అధికారం కోసం పొత్తు పెట్టుకుంటే.. పవన్ ఈ రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నారు అంటూ బదులు ఇవ్వడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పవన్ పొత్తు పెట్టుకున్నారు అంటూ గట్టిగానే వాదించడం మొదలుపెట్టారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తోక ముడిచింది. పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper