Homeఎంటర్టైన్మెంట్Peddi advance bookings overseas: 5 గంటల్లో 1 లక్ష డాలర్లు.. ఓవర్సీస్ లో ప్రభంజనం...

Peddi advance bookings overseas: 5 గంటల్లో 1 లక్ష డాలర్లు.. ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టించిన ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్..

Peddi advance bookings overseas: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో కాసేపటి క్రితమే మొదలు పెట్టారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే , ‘పెద్ది’ చిత్రం ఓపెనింగ్స్ లో పెద్ద సునామీ సృష్టించబోతుందని అర్థం […]

Peddi advance bookings overseas: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో కాసేపటి క్రితమే మొదలు పెట్టారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే , ‘పెద్ది’ చిత్రం ఓపెనింగ్స్ లో పెద్ద సునామీ సృష్టించబోతుందని అర్థం అవుతోంది. 898 షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా , కేవలం 5 గంటల్లోనే 1 లక్షకు పైగా డాలర్లు రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇండియా లోనే ఫాస్టెస్ట్ లక్ష డాలర్ల గ్రాస్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ‘పెద్ది’. గతం లో ఈ రికార్డు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం ఖాతాలో ఉండేది.

ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన మొదటి రోజు 87 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఇది ఆల్ టైం రికార్డు. కానీ ఓజీ చిత్రానికి కేవలం 56 షోస్ మాత్రమే ఓపెన్ చేశారు. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఏకంగా 898 షోస్ తో ఓపెన్ చేసారు. అందుకే ఆ రేంజ్ తేడా వచ్చిందని అంటున్నారు. కానీ 24 గంటల్లో ‘ఓజీ’ చిత్రానికి 2 లక్షల 67 వేల డాలర్లు , 600 షోస్ కి గానూ నమోదైంది. ఈ రికార్డుని పెద్ది అందుకోవడం చాలా కష్టమని, కేవలం 2 లక్షల డాలర్ల మార్కుని చేరుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ ఈ చిత్రానికి ఉన్నటువంటి ఊపుని చూస్తుంటే కచ్చితంగా 2 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్స్ నుండి రాబడుతుందని అంటున్నారు. అంతకు మించి కూడా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని , రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతానికి నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ విషయం లో ‘కల్కి’ చిత్రం నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ‘#RRR’ చిత్రం 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ తో రెండవ స్థానం లో నిలబడగా, 3.1 మిలియన్ డాలర్లతో ‘ఓజీ’ చిత్రం మూడవ స్థానం లో కొనసాగుతోంది. కేవలం తెలుగు వెర్షన్ తీసుకుంటే , ఓజీ నే టాప్ 2 స్థానంలో ఉందని అనుకోవచ్చు. ప్రస్తుతానికి పెద్ది కి ఉన్న ఊపుని చూస్తుంటే 2.8 మిలియన్ డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper