Homeఆంధ్రప్రదేశ్‌Veligonda Project: కూటమికి 'వెలిగొండ' క్రెడిట్ రాకుండా వైసిపి గట్టి ప్రయత్నాలు!

Veligonda Project: కూటమికి ‘వెలిగొండ’ క్రెడిట్ రాకుండా వైసిపి గట్టి ప్రయత్నాలు!

Veligonda Project: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అదే మాదిరిగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అక్కడ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం తో పాటు పరిహారం చెల్లించింది కూటమి ప్రభుత్వం. న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని రకాల పరిహారాలు వారికి దక్కాయి. నిర్వాసితులు గ్రామాలను విడిచిపెట్టి పునరావాస గ్రామాలకు వెళ్తున్నారు. దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తుండగా.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అవమానం జరిగిందంటూ వైసీపీ మీడియా ప్రచారం […]

Veligonda Project: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అదే మాదిరిగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అక్కడ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం తో పాటు పరిహారం చెల్లించింది కూటమి ప్రభుత్వం. న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని రకాల పరిహారాలు వారికి దక్కాయి. నిర్వాసితులు గ్రామాలను విడిచిపెట్టి పునరావాస గ్రామాలకు వెళ్తున్నారు. దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తుండగా.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అవమానం జరిగిందంటూ వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది. నిన్న జరిగిన ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని పక్కకు వెళ్లాలని సూచించినట్లు తెగ ప్రచారం నడుస్తోంది. అయితే అక్కడ జరిగింది వేరు అని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అదంతా తప్పుడు ప్రచారం అని తేల్చి చెబుతున్నాయి.

* పక్కకు వెళ్లాలని సూచిస్తే..
కరువు సీమకు కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతం పలికారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం జరిపిన క్రమంలో జల హారతి ఇచ్చారు. వంతెన వద్ద పూలు చల్లారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ చంద్రబాబు అవకాశం కల్పించారు. ఆ సమయంలోనే వారి వెనుక ఉండి పోయారు మంత్రి నిమ్మల రామానాయుడు. అయితే తన పక్కన ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని కాస్త పక్కకు వెళ్లాలని సూచించారు చంద్రబాబు. అలా ఆనం పక్కకు వెళ్ళగా.. ఒక్కొక్కరు వచ్చి పూలు చల్లారు. జరిగింది ఇది. కానీ ఆనం రామనారాయణ రెడ్డిని చంద్రబాబు అవమానించారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మెయిన్ మీడియాతో పాటు అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని టిడిపి కూటమి వర్గాలు చెబుతున్నాయి.

* నిర్వాసితుల పేరుతో రాజకీయం..
మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులకు అన్యాయం జరిగింది అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టింది వైసీపీ అనుకూల మీడియా. వాస్తవానికి ముందుగానే పరిహారంతో పాటు పునరావాసం కల్పించింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేసింది కూటమి ప్రభుత్వం. పరిహారంతో పాటు పునరావాసం పై నిర్వాసితులు ఆనందంగా ఉన్నారు. అయితే తరతరాలుగా తమ పూర్వీకుల నుంచి ఉన్న ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టినప్పుడు బాధ వుంటుంది. ఇలా విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎవరు హుషారుగా ఉండరు కదా. అయితే దానిని కూడా రాజకీయం చేయడం మొదలు పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ఆనం వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారని.. అవమానం జరగడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారంటూ ప్రచారం చేస్తోంది. కానీ నిన్న కార్యక్రమం అంతా చంద్రబాబు పక్కనే ఉండి పర్యవేక్షించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కేవలం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో కూటమికి వస్తున్న క్రెడిట్ డైవర్షన్ చేసేందుకే ఇటువంటి ఎత్తుగడ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి ప్రచారం కొత్త కాదు కాబట్టి పట్టించుకునే వారు చాలా తక్కువ.

 

View this post on Instagram

 

A post shared by Sakshi TV (@sakshitvdigital)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper