Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet Expansion: ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం!

AP Cabinet Expansion: ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం!

AP Cabinet Expansion: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా పాలనలో విప్లవాత్మక మార్పులు ప్రారంభించాలని చూస్తోంది. అందులో భాగంగా ఒక కొత్త మంత్రిత్వ శాఖను తెరపైకి తెస్తోంది. సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే కొత్త శాఖ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది. అయితే దీని పేరిట ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రికి బాధ్యతలు కట్టబెట్టె అవకాశం ఉంది. అయితే ఈ ఒక్క శాఖ కోసం మంత్రివర్గ విస్తరణ చేపడతారా? లేకుంటే భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. రేపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ఉంది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

* కొత్త శాఖ ఏర్పాటు..
ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ( cabinet extension) ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. తరువాత మంత్రివర్గ విస్తరణ పై ఒక క్లారిటీ రానుంది. కానీ అసెంబ్లీ లాబీల తో పాటు ఎమ్మెల్యేలు ఒకచోటకు చేరే క్రమంలో దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రముఖంగా ఓ ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సమూల ప్రక్షాళన ఉంటుందన్న ప్రచారం మాత్రం నడుస్తోంది. టిడిపి నుంచి చాలామంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రి పదవి ఖాయమని ఏనాడో తేలిపోయింది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖను ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* డిన్నర్ మీటింగ్..
రేపు సీఎం చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. వారి మధ్య డిన్నర్ మీటింగ్ జరగనుంది. సుమారు గంటన్నర పాటు ఏకాంతంగా చర్చించనున్నారు. అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పైనే ఆ ఇద్దరు నేతలు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి జనసేనకు ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. బిజెపి కిసైతం ప్రాతినిధ్యం పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పార్టీకి కీలక భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై కూడా ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపి కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. మార్చి 19న ఉగాది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణతో పాటు ఇంకోవైపు వైసీపీ విషయంలో బిజెపి నుంచి సంచలన విషయాలు బయట పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఉగాదికి రాజకీయ సంచలనాలకు తెరలేపే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper