Telugu celebrities: పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ప్రతిష్టకు ప్రతిష్ట.. గౌరవానికి గౌరవం.. ఇంకా చాలా .. వీటన్నిటిని మన సమాజం వీళ్లకు భారీగానే ఇచ్చింది. పేరూ ఊరూ తెలియకపోయినప్పటికీ నెత్తిన పెట్టుకుంది. సెలబ్రిటీ అనే హోదా ఇచ్చింది. కానీ ఎంతో ఇచ్చిన సమాజానికి వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చారో తెలుసా..
సెలబ్రిటీలు వివాదాలలో చిక్కుకోవడం మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు. కాకపోతే గతంలో మీడియా ఈ స్థాయిలో లేదు కాబట్టి వాళ్ల గురించి అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది. ఇలాంటప్పుడు సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఇచ్చిన సమాజం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాము చేసే అడుగులను సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది అనే సోయి ఉండాలి. ఇది లేకపోతే సెలబ్రిటీలు బొక్క బోర్లా పడడం ఖాయం. అలా బొక్క బోర్ల పడి పరువు పోగొట్టుకున్న సెలబ్రిటీల జాబితా ఇప్పుడు ఏంటో చూద్దాం.
గతంలో సినిమాలలో నటించేవారిని మాత్రమే సెలబ్రిటీగా పరిగణించేవారు. కానీ ఇప్పటి కాలంలో టెలివిజన్
.. గాయకులు.. డాన్సర్లు.. సోషల్ మీడియాలో ప్రభావం చూపించగలిగే వారిపై మన సమాజం సెలబ్రిటీ ముద్ర వేసింది. వారందరికీ ఎన్నో రకాలుగా మన సమాజం చేయూత అందిస్తూనే ఉంది. కాకపోతే వారు సమాజం నుంచి భారీగా స్వీకరించి.. చివరికి ఏదో ఒక వివాదాల్లో చిక్కుకొని పరువు పోగొట్టుకుంటున్నారు.
మంగ్లీ
తెలుగు జానపద.. సినీ గాయనిగా.. టెలివిజన్ యాంకర్ గా.. విలక్షణమైన గొంతుతో.. సంప్రదాయ బంజారా దుస్తులు ధరించి.. ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో తెలుగు రాష్ట్రాలలో విషసమైన గుర్తింపు పొందారు మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్. జూన్ 10 1994 లో అనంతపురం జిల్లా గుత్తి మండలం బచ్చినపల్లి తండాలో ఒక సాధారణ నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించారు ప్రాథమిక విద్యను తండాలో పూర్తీ చేశారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ సమయంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆమెలో ప్రతిభను గుర్తించి సంగీతం నేర్చుకునేందుకు ఆర్థిక సహాయం అందించింది.
బతుకమ్మ బోనాలు సంక్రాంతి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉగాది సమ్మక్క సారక్క వంటి ప్రత్యేక సందర్భాలలో ఆమె పాడిన పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి.
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఆమె పాటలు పాడారు. అలవైకుంటపురం అనే సినిమాలో రాములు రాముల.. పుష్ప.. బలగం.. ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులోనే కాకుండా.. కన్నడలో కూడా ఆమె పాటలు పాడారు 2021లో మాస్ట్రో.. 2018లో శైలజ రెడ్డి అల్లుడు.. 2020లో గువ్వా గోరింక అనే సినిమాలలో ఆమె నటించారు.
2020లో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ జానపద కళాకారుని అనే పురస్కారం అందించింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్.. ఐఫా ఉత్సవం అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.. 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యేక సలహాదారుగా నియమించింది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మంగ్లీ 2026 ఏప్రిల్ నెలలో సుమారు 200 కోట్ల మైక్రో ఫైనాన్స్ కుంభకోణానికి సంబంధించిన వివాదంలో కూరుకుపోయారు. అయితే ఇందులో తనకు.. తన కుటుంబానికి ఎటువంటి ప్రమేయం లేదని మంగ్లీ వివరించారు. ఇందులో రమావత్ మధు అనే వ్యక్తి ఇంట్లో ఒకపూట భోజనం చేసినందుకు తనను ఇబ్బంది పెట్టారని.. రకరకాల ఆరోపణలు చేశారని ఆమె వాపోయారు. దీని వెనక ఎవరి పాత్ర ఉంది.. ఎవరి చేయి ఉంది అనే విషయం పక్కన పెడితే మంగ్లీ తీవ్రమైన వివాదంలో కూరుకుపోయారు. ఇన్ని రోజులపాటు సంపాదించుకున్న మంచి పేరును పోగొట్టుకోవాల్సి వచ్చింది..
మాధురి రాథోడ్
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈమె ప్రముఖ జానపద నృత్య కారినిగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మా ఇటీవల మరో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయితో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఈశ్వర్ సాయి భార్య వేములవాడలో మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయిని పట్టుకుంది. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ ఓకే గదిలో ఉండగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిద్దరిని పట్టుకున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికి సంచలనం సృష్టిస్తుంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తన మీద ఆకారణంగా దాడి చేసి బూతులు తిట్టిందని.. తన ఐఫోన్ లాక్కుని వెళ్లిందని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని మాధురి మొదట వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని ఈశ్వర్ సాయి మోసం చేశాడని మాధురి రాథోడ్ హైదరాబాదులో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేశపెట్టి ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈశ్వర్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడం పట్ల.. మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగడం లేదని మనస్థాపనతో హైదరాబాదులోని పుప్పాలగూడలో తన ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. మొతానికి ఈ వివాదం ద్వారా మాధురి రాథోడ్ చాలావరకు అవకాశాలను కోల్పోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తనకు న్యాయం జరగాలని మాధురి రాథోడ్ ఇప్పటికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉంది.
ఈశ్వర్ సాయి
కేవలం మాధురి రాథోడ్ మాత్రమే కాకుండా ఈశ్వర్ సాయి కూడా ఈ వివాదంలో పీకలలోతు కూరుకుపోయాడు. బాసింగ బలాలు అనే పాట ద్వారా ఏ స్థాయిలో అయితే గుర్తింపు తెచ్చుకున్నాడో .. మాధురి రాథోడ్తో రెడ్ హ్యాండెడ్ గా దొరికి అదే స్థాయిలో తన పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పట్లో అతడు ఫోక్ సాంగ్స్ లో కనిపించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇప్పటికే అతడు మాధురి రాథోడ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులు నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్నాడు. ఒకవేళ అతడు బయటికి వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ ఒకప్పటిలాగా ఈశ్వర్ సాయికి సొసైటీలో గౌరవం ఉండదు. పైగా ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రారు.
మధుప్రియ
తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది మధుప్రియ. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనంటూ పాడిన ఒక పాట ఆమెకు తిరుగులేని స్థాయిని అందించింది. అయితే ఆమె కాలేశ్వరం ఆలయంలో గర్భగుడిలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేయడం తీవ్రమైన వివాదానికి దారి తీసింది. సాధారణంగా కాలేశ్వరం ఆలయంలో గర్భగుడిలోకి మొబైల్ ఫోన్లు.. కెమెరాలకు అనుమతి ఉండదు. అలాంటిది మధుప్రియ బృందం ఏకంగా కెమెరాలతోనే గర్భగుడిలో చోటుచేయడం పట్ల హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిజెపి నాయకులు కూడా తీవ్రస్థాయిలో ఆమె మీద మండిపడ్డారు. మరోవైపు నాడు మధుప్రియ చేసిన పనికి ఆలయ పూజారికి దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. మధుప్రియ 2017లో తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ వ్యవహారం మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. వివాహ జరిగిన కొద్ది రోజులకే తన భర్త శ్రీకాంత్ అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కుండా బల మధ్య గొడవలు జరిగాయి. చివరికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరు విడాకులు తీసుకున్నారు. మరోవైపు ఇటీవల రేవంత్ రెడ్డి పై కూడా మధుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కేవలం కేసీఆర్ కు మాత్రమే పాటలు పాడుతానంటూ వ్యాఖ్యానించింది. దీని పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇలా సొసైటీలో ఎంతో పేరు తెచ్చుకొని.. మంచి స్థానంలో ఉన్న సెలెబ్రిటీలు ఏదో ఒక వివాదంలో చిక్కుకొని.. మొత్తానికి తమ స్థాయిని కోల్పోయారు. గౌరవాన్ని తగ్గించుకున్నారు. అందువల్లే ఇప్పుడున్న సెలబ్రిటీలకు.. సెలబ్రిటీగా మారబోతున్న వాళ్లకు వీళ్ళు ఎప్పటికీ ఒక గుణపాఠం లాగా మిగిలిపోతారు.