Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదటి వారం లో ఉండేది కాదు. కానీ ‘బిగ్ బాస్ 10’ లో ఈ కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టారు. నిన్న రాత్రి ఆర్జే చరణ్ ని ఎలిమినేట్ చేశారట. గత టాస్క్ లో రోహిత్ టీం నుండి చరణ్ , చైత్ర లను , అదే విధంగా దేబ్ జానీ టీం నుండి రామ్ ప్రసాద్ లను హై రిస్క్ జోన్ లో పెట్టారు. ఈ ముగ్గురికి నిన్న అర్థ రాత్రి కంటెస్టెంట్స్ ఓటింగ్ పెట్టారు. ఈ ఓటింగ్ లో చరణ్ కి తక్కువ ఓటింగ్ రావడంతో ఆయన్ని ఎలిమినేట్ చేశారు. అయితే గత సీజన్ లో సంజన ని కూడా ఇలాగే ఎలిమినేట్ చేసారని చెప్పి , ఆ తర్వాత ఆమెని సీక్రెట్ రూమ్ లోకి పంపించి వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ లోకి తిరిగి తీసుకొస్తారు.
చరణ్ ని కూడా అలాగే హౌస్ లోకి తిరిగి తీసుకొస్తారేమో అనే ఆశ ఆయన అభిమానుల్లో ఉంది. కానీ అలాంటి ఆలోచనలు బిగ్ బాస్ టీం లో లేవట. సంజన లాగా కంటెంట్ ఉన్న కంటెస్టెంట్ ని ఎలా అయినా తీసుకొస్తారు. కానీ చరణ్ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఆస్తులు కోల్పోయిన వాడిలాగా డల్ గా కూర్చోవడం బహుశా బిగ్ బాస్ టీం కి నచ్చి ఉండకపోవచ్చు. అందుకే చరణ్ ని ఎలిమినేట్ చేసి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క ఓటింగ్ ప్రకారం చూస్తే చరణ్ అసలు డేంజర్ జోన్ లో లేడు. కృష్ణుడికి అందరికంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఆయనకు ముందు ఝాన్సీ ఉంది. వీళ్లిద్దరి డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఒకవేళ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలోనే ఉంటుంది.
ఇకపోతే టాప్ 5 ఓటింగ్ తో దూసుకుపోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి చూస్తే , అందరికంటే మొదటి స్థానం లో రోహిత్ భారీ మెజారిటీ తో దూసుకుపోతున్నాడు. ఆయన తర్వాత రెండవ స్థానం లో ముకేశ్ గౌడ కొనసాగుతున్నాడు. ముకేశ్ గౌడ కి మంచి ఫాలోయింగ్ ఉంది కానీ , ఇప్పటి వరకు అయితే తన మార్క్ గేమ్ ని చూపించలేకపోయాడు. ఒకవేళ అణా మార్కుని చూపిస్తే మాత్రం మొదటి స్థానం లోకి అవలీలగా వచ్చేస్తాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత మూడవ స్థానం లో ఆటో రామ్ ప్రసాద్ , నాల్గవ స్థానం లో అమన్ , ఐదవ స్థానం లో త్రిగున్ కొనసాగుతున్నారు.