Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: మిడ్ వీక్ ఎలిమినేషన్ లో చరణ్ అవుట్.. వెక్కి వెక్కి...

Bigg Boss 10 Telugu: మిడ్ వీక్ ఎలిమినేషన్ లో చరణ్ అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్!

Bigg Boss 10 Telugu: ఆడియన్స్ ఓటింగ్ కి బిగ్ బాస్ లో విలువ అనేదే లేదా?, వాళ్లకి ఇష్టమొచ్చినవాళ్ళని హౌస్ లో ఉంచుతారు , గేమ్ కి అవసరం లేదు అనుకునోళ్ళని ఎలిమినేట్ చేయడం , అది కూడా కంటెస్టెంట్స్ ఓటింగ్ తో, ఇదెక్కడి న్యాయం?. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన టాస్క్ లో , రోహిత్ టీం , రామ్ ప్రసాద్ టీం ఇద్దరూ తప్పులు చేయడం వల్ల , బిగ్ బాస్ […]

Bigg Boss 10 Telugu: ఆడియన్స్ ఓటింగ్ కి బిగ్ బాస్ లో విలువ అనేదే లేదా?, వాళ్లకి ఇష్టమొచ్చినవాళ్ళని హౌస్ లో ఉంచుతారు , గేమ్ కి అవసరం లేదు అనుకునోళ్ళని ఎలిమినేట్ చేయడం , అది కూడా కంటెస్టెంట్స్ ఓటింగ్ తో, ఇదెక్కడి న్యాయం?. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన టాస్క్ లో , రోహిత్ టీం , రామ్ ప్రసాద్ టీం ఇద్దరూ తప్పులు చేయడం వల్ల , బిగ్ బాస్ వాళ్ళ టీమ్స్ లో ఒకరిని హై రిస్క్ జోన్ లో పెట్టమని అంటారు. రామ్ ప్రసాద్ టీం నుండి రామ్ ప్రసాదే హై రిస్క్ జోన్ లోకి ఏరికోరి వస్తాడు. ఇక రోహిత్ టీం నుండి , టాస్క్ పెర్ఫార్మన్స్ ఆధారంగా చరణ్ ని హై రిస్క్ జోన్ లో పెడుతారు. ఇక చివర్లో రోహిత్ , వంశీ, త్రిగున్ , ముకేశ్ లు కలిసి ఒక గేమ్ ఆడుతారు.

ఈ గేమ్ లో రోహిత్, వంశీ లు గెలిచిన కారణంగా , వాళ్ళ టీం నుండి చైత్ర హై రిస్క్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. అది ఎలా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు ఆగాల్సిందే. మొత్తం మీద ఇలా ముగ్గురు హై రిస్క్ జోన్ లోకి వస్తారు. అర్థ రాత్రి బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనే ట్విస్ట్ ఇస్తాడు. హై రిస్క్ జోన్ లో ఉన్నటువంటి చరణ్ , ఆటో రామ్ ప్రసాద్ , చైత్ర లను పిలిచి, ఈ ముగ్గురిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని కోరుకుంటున్నారు?, ఎవరు వెళ్లిపోవాలని అనుకుంటున్నారు? అని అడగ్గా , చరణ్ కి తక్కువ ఓట్లు పడడంతో ఆయన్ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. చరణ్ కి కేవలం రెండు ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి.

అసలు కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా చరణ్ ని ఎలిమినేట్ చేయడం పూర్తిగా అన్యాయం. ఎందుకంటే హౌస్ రెండు గ్రూప్స్ గా విడిపోయాయి. త్రిగున్ & కో ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నారు. పైగా సెలబ్రిటీలు 10 మంది ఉన్నారు, సామాన్యులు కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు , ఇక ఓట్లు కచ్చితంగా సెలబ్రిటీలకే ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం ఎంతటి అన్యాయం. ఏ యాంగిల్ లో చూసిన చరణ్ మంచి సత్తా ఉన్నా కంటెస్టెంట్. ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో కాస్త డల్ గా ఉన్నాడు కానీ, అతనికి నాగార్జున కాస్త బూస్ట్ ఇస్తే , కచ్చితంగా టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కంటెస్టెంట్ ని ఇంత తేలికగా ఎలిమినేట్ చేయడం అన్యాయం.

ఇతనితో పోలిస్తే చైత్ర , కృష్ణుడు చాలా డల్ గా ఉన్నారు. వీళ్ళ నుండి అసలు కంటెంట్ కూడా రావడం లేదు. కృష్ణుడు ఎలాగో హై రిస్క్ జోన్ లోకి రాలేదు , చైత్ర వచ్చింది, న్యాయంగా అయితే ఆమెకే ఎక్కువ ఓట్లు పడాలి , ఆమెనే ఎలిమినేట్ అవ్వాలి. కానీ అది జరగలేదు. కేవలం కంటెస్టెంట్స్ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల చరణ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇకపోతే చరణ్ ని హై రిస్క్ జోన్ పెట్టాల్సిన పరిస్థితి రావడం వల్ల , రోహిత్ ఎంత ఏడుస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి రోహిత్ ఇప్పుడు చరణ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల , ఏ రేంజ్ లో ఏడ్చి ఉంటాడో మీరే ఊహించుకోండి. పాపం గుండెలు బాదుకుని ఏడ్చాడట. అయితే చరణ్ ఎలిమినేషన్ రోహిత్ కి మంచి చేసింది , అదే విధంగా చెడు కూడా చేసింది అనే చెప్పొచ్చు.

రోహిత్ ని అదే పనిగా టార్గెట్ చేస్తున్న త్రిగున్ కి ఈ అంశం ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి. వాడు కావాలని మిమ్మల్ని ఇరికించి తప్పుకుంటున్నాడు , అతని వల్లే చరణ్ ఎలిమినేట్ అయ్యాడు అని పదే పదే రోహిత్ ని టార్గెట్ చేస్తూ , అతన్ని మానసికంగా కృంగిపోయేలా చేయొచ్చు. అలా కాకుండా , ఈ ఒక్క అంశం రోహిత్ లో కసి పెంచి, టాస్కులు ఇంకా గొప్పగా ఆడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా తన టీం ని కూడా కాపాడుకోవచ్చు. కానీ త్రిగున్ రోహిత్ ని టార్గెట్ చేస్తున్న విధానం మాత్రం అత్యంత దారుణం అనే చెప్పాలి. త్రిగున్ కి తోడు వర్షిణి కూడా చేరింది. ఈమె నిన్న త్రిగున్ మాట్లాడుతూ ‘వాడు వీళ్లందరినీ ఉపయోగించుకొని , వాళ్ళని తొక్కుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు’ అని అంటాడు. అప్పుడు వర్షిణి ‘అది ఈ దద్దిలకు అర్థం కావడం లేదా?’ అని అనగా, అందుకు త్రిగున్ ‘వాళ్లకు అర్థం అవ్వదు , ఎందుకంటే వాళ్ళు దద్దిలు కాబట్టి’ అని అంటాడు.

ఆ తర్వాత డిష్ వాషింగ్ సమయం లో ఇతను రోహిత్ తో జరిపిన సంభాషణ ఏదైతే ఉందో , బిగ్ బాస్ హిస్టరీ లోనే ది వరస్ట్ సంభాషణ అని చెప్పొచ్చు. రోహిత్ కూడా ఈ సంభాషణ లో త్రిగున్ కి ఇచ్చి పారేశాడు కానీ, పాపం ఎమోషనల్ గా చాలా డౌన్ అయిపోయాడు. ఇది షాలిని గమనిస్తుంది. దగ్గరకు వచ్చి రోహిత్ కి ధైర్యం చెప్తుంది. రోహిత్ చుట్టూ చాలా మంచి స్నేహితులు ఉన్నారు , గోతులు తవ్వే వాళ్ళు లేరు , ఇదే రోహిత్ కి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో. ఇది కాసేపు పక్కన పెడితే , చరణ్ ని ఎలిమినేట్ చేయడం న్యాయం అనిపించిందా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper