TDP: పట్టణ స్థానిక ఎన్నికల్లో టిడిపి తొలి జాబితా విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లు.. 29 మున్సిపాలిటీలకు మేయర్లు.. చైర్మన్ ల స్థానాలకు అభ్యర్థులను టిడిపి ప్రకటించింది. మొత్తం 36 మందిలో 22 మంది అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందినవారు. 16 చోట్ల బీసీలకు అవకాశం.. అంటే మొత్తంగా తొలి జాబితాలోనే 44 శాతం బీసీలకు కేటాయించి.. సామాజిక చైతన్యం అనే పదానికి అర్థం చెప్పింది టిడిపి.
ఇక ఏడు కార్పొరేషన్లలో.. ఐదు మేయర్ స్థానాలను బిసి.. ఎస్సీ అభ్యర్థులకు కేటాయించింది. వీరిలో నలుగురు బీసీలు.. ఒకరు ఎస్సీ.. ఆళ్లగడ్డ, రాయచోటి ప్రాంతంలో ఇద్దరు మైనారిటీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. మొత్తం జాబితాలో ముగ్గురు ఎస్సీలు.. ఒకరు ఎస్టి ఉన్నారు.
33 మందిలో 25 మంది అంటే 76% డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నత విద్య అర్హత కలిగిన వారు. వీరిలో ఏడుగురు పీజీ పట్టభద్రులు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, విద్యార్ధులు కలిగిన వారు. ముగ్గురు వైద్యులు. అభ్యర్థుల సగటు వయసు 45.7 సంవత్సరాలు. మొత్తం అభ్యర్థుల్లో 16 మంది 45 ఏళ్లలోపు వారు. పదిమంది 40 ఏళ్లలోపు వారు. ఏడుగురు మేయర్ అభ్యర్థుల సగటు వయసు 39 సంవత్సరాలు. చైర్ పర్సన్ అభ్యర్థుల సగటు వయసు 47.5 సంవత్సరాలు. మేయర్ అభ్యర్థుల సగటు వయసు దానికంటే సుమారు 9 సంవత్సరాలు తక్కువ.
అభ్యర్థులలో తక్కువ ఏజ్ ఉన్న క్యాండిడేట్ రాజంపేట అభ్యర్థి డాక్టర్ దంతం గాయత్రి. ఈమె వయసు 26 సంవత్సరాలు. ఆ తర్వాత విజయనగరం అభ్యర్థి వైస్ 31 సంవత్సరాలు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వయసు 32 సంవత్సరాలు.. 36 మందిలో 19 మంది మహిళలు.. 53% మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలు 17. పార్టీ మొత్తం 19 మంది మహిళలకు అవకాశం కల్పించింది. మహిళలకు ఇచ్చే హక్కుల పరిధిని దాటి మరో రెండు స్థానాల్లో మహిళలను ఎంపిక చేసింది.
మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ కాని చిత్తూరు కార్పొరేషన్.. బద్వేల్ స్థానంలో కూడా మహిళలకు అవకాశం కల్పించింది టిడిపి. చెప్పినట్టుగానే బీసీలకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీలకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చంది. మహిళల విషయంలో సాధికారితకు పెద్ద పీట వేసింది. తద్వారా అన్ని వర్గాలకు సముచిత స్థాయి కల్పించింది టీడీపీ. ప్రత్యర్థి పార్టీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసింది టీడీపీ నాయకత్వం.