Homeఆంధ్రప్రదేశ్‌Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణంరాజుకు షాక్.. హైకోర్టు కీలక ఆదేశం!

Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణంరాజుకు షాక్.. హైకోర్టు కీలక ఆదేశం!

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. ఆయనపై ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. గతంలో రఘురామ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉండేది ఇండ్ భారత్ పవర్ జన కామ్ లిమిటెడ్ సంస్థ. అయితే ఆ సంస్థ దివాలా తీసింది. దీంతో జాతీయ లా ట్రైబ్యూనల్ నిర్వహించిన వేలం ప్రక్రియలో దీన్ని అగతా ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ. 101.42 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం రఘురామ […]

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. ఆయనపై ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. గతంలో రఘురామ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉండేది ఇండ్ భారత్ పవర్ జన కామ్ లిమిటెడ్ సంస్థ. అయితే ఆ సంస్థ దివాలా తీసింది. దీంతో జాతీయ లా ట్రైబ్యూనల్ నిర్వహించిన వేలం ప్రక్రియలో దీన్ని అగతా ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ. 101.42 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం రఘురామ కుటుంబ సభ్యుల నుంచి దీనికి సంబంధించిన సొమ్ము వసూలు చేసుకునేందుకు కొత్త సంస్థకు అవకాశం కలిగింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ అదే పని చేసింది. కానీ ఫైలు ఇవ్వకుండా, సొమ్ము కట్టకుండా రఘురామకృష్ణం రాజు మనసులు తమను బెదిరిస్తున్నారంటూ అగతా సంస్థ చైర్మన్, డైరెక్టర్ మాదాల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

హైకోర్టులో విచారణ..
అయితే బాధితుడు మాదాల శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరులో తన ఇంట్లోకి రఘురామ పంపిన మనుషులు అక్రమంగా ప్రవేశించి.. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు చేశారని.. తనకు అమ్మిన కంపెనీకి సంబంధించిన ఫైలు, రికవరీ పిటిషన్లను సైతం వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. మాదాల శ్రీనివాస్ పై బెదిరింపులకు దిగిన వ్యవహారంలో రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే చట్టప్రకారం కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. తగిన ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేసింది. ఈబారక్ తమకు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

చుట్టూ వివాదాలు..
రఘురామకృష్ణం రాజు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అయితే ఆయన చుట్టూ వివాదాలు కొత్త కాదు. గతంలో సైతం ఇటువంటి వివాదాస్పద ఘటనలు జరిగాయి. అయితే తనకు రఘురామకృష్ణంరాజు నుంచి ప్రాణహాని ఉందని.. తనకు 2 ప్లస్ 2 పోలీసుల భద్రత కల్పించాలని కూడా బాధితుడు మాదాల శ్రీనివాస్ పోలీసులను కోరుతున్నారు. దీనిపై కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తదుపరి విచారణలో హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. హిందుత్వ వాదంతో పాటు హిందూ ఆలయాల పరిరక్షణకు నడుంబిగించారు రఘురామకృష్ణంరాజు. ఇప్పటికీ ఆయన కోసం ఒక వ్యవస్థ ఉంది. అయితే తాజాగా రఘురామకృష్ణం రాజు పై వచ్చిన ఈ బెదిరింపులకు సంబంధించి రాజకీయ ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉంది ప్రత్యర్థులకు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper