Raghu Rama Krishna Raju: రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీడియా ఎదుటికీ వచ్చిన తర్వాత సాధ్యమైనంతవరకు పరుషమైన పదజాలాన్ని వాడకూడదు. కానీ నేటి కాలంలో రాజకీయ నాయకులు పరుష పదజాలం వాడే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మీడియా ముందు అయితే చిందులు తొక్కుతున్నారు. కొన్ని సందర్భాలలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.
నేటి స్మార్ట్ కాలంలో బూతులకు విపరీతమైన విలువ ఉంది. బూతులు మాట్లాడే నేతలకు బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే అప్కమింగ్ పొలిటికల్ లీడర్లు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్లు నా బూతు నా భవిష్యత్తు అనే సిద్ధాంతాన్ని దర్జాగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఏపీ లోని టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చేరిపోయినట్టు కనిపిస్తోంది.
కొంతమంది పాత్రికేయులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. పాత్రికేయులను ఆయన పిచ్చనా కొడుకులు.. బ్రోకర్ నా కొడుకులు.. అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. అంతేకాదు, కొంతమంది పాత్రికేయుల పేర్లను ప్రముఖంగా ప్రస్తావిస్తూ తిట్టి పోశారు. వాస్తవానికి ఆ పాత్రికేయులు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారని జర్నలిస్ట్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి నేటి కాలంలో ఏ మీడియా సంస్థ కూడా న్యూట్రల్ గా లేదు. ఆ విషయం రఘురామకృష్ణంరాజుకు కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన తన అసహనాన్ని ప్రదర్శించారు.
కొంతమంది పాత్రికేయులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పదేపదే ప్రశ్నిస్తున్నారని.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కూడా అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. పాత్రికేయ లోకానికి ఆస్థాయి రిపోర్టర్లు, జర్నలిస్టులు కళంకం అని రఘురామ ఆరోపించారు. వాస్తవానికి, ఈ స్థాయిలో రఘురామ ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాకపోయినప్పటికీ.. ఆయన వ్యాఖ్యానించిన మాటలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. సహజంగానే రఘురామ చేసిన విమర్శలను వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. ఇక వైసిపి అనుబంధం సోషల్ మీడియా గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ రఘురామ విధానపరంగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఇలా బూతులు తిట్టడంతో అనవసరంగా విమర్శల పాలవుతున్నారు.
రాజ్యంగబద్ధమైన ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి జర్నలిస్టులపైన పచ్చి బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు pic.twitter.com/iSs53Z1L4s
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2025