spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Sharmila Mavigun controversy: షర్మిలపై ఆమె ప్రయోగం తగునా

Sharmila Mavigun controversy: షర్మిలపై ఆమె ప్రయోగం తగునా

Sharmila Mavigun controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మహిళా నేతలు ఇప్పుడు షర్మిలను టార్గెట్ చేసుకుంటున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో షర్మిల ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు జగన్ బిజెపితో కూడా చేతులు కలిపారని ఆమె ఆరోపిస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆమెను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. మొన్ననే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల గురించి కొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు షర్మిల. ఏకంగా వారిని కుక్కలతో పోల్చారు. దీంతో వైసీపీ నేతలు సైలెంట్ కావాల్సి వచ్చింది. అయితే తాజాగా మావిగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రోజాతో పాటు వరుదు కళ్యాణి మాట్లాడుతున్నారు.

మంచి నాయకురాలిగా గుర్తింపు
అయితే సాధారణంగా శాసనమండలిలో విధానపరమైన మాటలను చెబుతుంటారు వరుదు కళ్యాణి( varudhu Kalyani ). ఎందుకంటే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. చాలా పద్ధతిగా మాట్లాడతారని మంచి పేరు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి మహిళ నాయకురాలు అని ఆమె పేరు తెచ్చుకున్నారు కూడా. ఒకానొక దశలో ఆమె శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలిగా వ్యవహరిస్తారని ఆ మధ్యన ప్రచారం నడిచింది. బొత్స అనారోగ్యానికి గురికావడంతో రాజకీయాలనుంచి తప్పుకుంటారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ వచ్చింది. అయితే ఆయన స్థానాన్ని వరుదు కళ్యాణితో భర్తీ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక బలమైన ప్రచారం జరిగింది.

అనవసరంగా వివాదాస్పద ముద్ర..
అయితే అనవసరంగా ఇప్పుడు షర్మిల( Sharmila) విషయంలో వరుదు కళ్యాణి తో మాట్లాడిస్తున్నారు. రోజా ఏం మాట్లాడినా.. ఎలా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే. అటువంటి ఆమెతో కలిసి ఇప్పుడు వరుదు కళ్యాణి మాట్లాడుతుండడం.. అది కూడా షర్మిలపై మాట్లాడిస్తుండడం మాత్రం ఎంత మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏమాత్రం తప్పుడు వ్యాఖ్యలు చేసిన ప్రజల్లో తప్పుడు నాయకురాలిగా ఆమె ముద్రపడడం ఖాయం. ఈ విషయంలో వరుదు కళ్యాణి జాగ్రత్త పడకపోతే వివాదాస్పదముద్రపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పొలిటికల్ వర్గాల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. దానిని అనవసరంగా చెడగొట్టుకోవడం ఆమెకు తగదు కూడా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper