spot_img
Homeలైఫ్ స్టైల్Side effects of staying in AC: ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా.. మీ డబ్బులు.....

Side effects of staying in AC: ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా.. మీ డబ్బులు.. ఆరోగ్యం ఖర్చయినట్టే..

Side effects of staying in AC: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేస్తుంది. అయితే వేసవిలో చల్లదనం కోసం ఒకప్పుడు ఫ్యాన్లు, కూలర్లను ఉపయోగించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అధిక వేడి ఉండడంతో ఏయిర్ కండీషన్ వాడకం తప్పడం లేదు. దీంతో ప్రతీ ఇంట్లో ఏసీ తప్పనిసరిగా మారింది. అయితే చల్లదనం కోసం ఏసీని అధికంగా వాడటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

Air Contidioner (AC)లో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం సహజ వాతావరణానికి దూరమవుతుంది. ముఖ్యంగా గది పూర్తిగా మూసివేసి AC వాడితే తాజా గాలి లోపిస్తుంది. దీని ప్రభావంగా శ్వాసకోశ సమస్యలు, గొంతు ఇబ్బందులు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. అలాగే చల్లని గాలిలో ఎక్కువసేపు ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి తలనొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఏసీ గాలి తేమను తగ్గించే స్వభావం కలిగి ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, కళ్లలో ఎండదనం, పెదవులు చిట్లడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫిల్టర్లు శుభ్రంగా లేకపోతే దుమ్ము, బాక్టీరియా గాల్లోకి వచ్చి అలర్జీలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు కలిగించే అవకాశముంది. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే ఆరోగ్యంపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఏసీల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. రోజుకు ఎక్కువ గంటలు ఏసీ వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి భారీ బిల్లులు వస్తాయి. ముఖ్యంగా పాత మోడల్ ఎయిర్ కండీషనర్ లు ఎక్కువ విద్యుత్ తీసుకుంటాయి. ఫిల్టర్లు శుభ్రం చేయించకపోయినా లేదా సర్వీసింగ్ చేయించకపోతే యంత్రం పనితీరు తగ్గి మరింత కరెంట్ వినియోగిస్తుంది.

ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఏసీని 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం ఆరోగ్యానికి మంచిది. గదిలో అప్పుడప్పుడు గాలి రాకపోకలు ఉండేలా కిటికీలు తెరవడం అవసరం. ఫిల్టర్లను నిరంతరం శుభ్రం చేయడం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే ఫ్యాన్‌తో పాటు ఏసీని వాడితే చల్లదనం సమానంగా వ్యాపించి విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

వేసవిలో ఏసీ వాడకం అవసరం అయినా, అతి వినియోగం అనారోగ్యం మరియు ఆర్థిక భారం రెండింటికీ కారణమవుతుంది. సరైన విధంగా వినియోగించడం ద్వారా చల్లదనాన్ని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని, డబ్బును కూడా కాపాడుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Oktelugu Epaper