Homeఆంధ్రప్రదేశ్‌RK Roja Controversial Comments: ఆర్కే రోజా సంచలన కామెంట్స్!

RK Roja Controversial Comments: ఆర్కే రోజా సంచలన కామెంట్స్!

RK Roja Controversial Comments: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యవహార శైలి పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చారు. ఈ అంశంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూతి మీద పట పట వెయ్యాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె స్పందించడం […]

RK Roja Controversial Comments: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యవహార శైలి పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చారు. ఈ అంశంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూతి మీద పట పట వెయ్యాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె స్పందించడం తప్పులేదు కానీ.. ఆ స్థాయిలో వ్యాఖ్యానాలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముప్పేట దీనిపై దాడి చేస్తుండగా.. అవన్నీ ఫేక్ వీడియోలు అంటూ మరో రకంగా ప్రచారం నడుస్తోంది. ప్రజలు ఒక రకమైన అయోమయానికి గురవుతున్నారు.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

* ఇప్పటికే అనేక ఆరోపణలు..
తిరుమల తిరుపతి దేవస్థానానికి( Tirumala Tirupati Devasthanam) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో.. చాలా రకాల తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా నెయ్యి కల్తీ వ్యవహారం అనేది తీవ్ర దుమారానికి దారితీసింది. ఇంకోవైపు పరకామణి కేసు ఆ పార్టీ మెడకు చుట్టుకుంది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై అన్యమత ముద్ర ఉంది. వై వి సుబ్బారెడ్డి తో పాటు భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో కూడా కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఇంకోవైపు తిరుమల దర్శనం టిక్కెట్ల విషయంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అయితే బి ఆర్ నాయుడు విషయంలో తప్పు అయితే ఎవరు సమర్థించ లేరు కానీ.. ఒకవైపు ఫేక్ వీడియోలు అని ప్రచారం నడుస్తుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు.

* గత అనుభవాల దృష్ట్యా..
వాస్తవానికి మాజీ మంత్రి ఆర్కే రోజా పై వివాదాస్పద ముద్ర ఉంది. గతంలో కూడా ఆమె విషయంలో చాలా రకాల ప్రచారం నడిచింది. మీడియా ముందు కూడా ఆమె బ్లాస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే విపరీతంగా అభిమానించే బండ్ల గణేష్ తో సైతం ఆమె ఓ డిబేట్లో వివాదం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు ఎపిసోడ్ విషయంలో ఆమె సాధారణంగా స్పందించవచ్చు. సాధారణ వ్యాఖ్యలు చేయవచ్చు. చాలా దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆమె ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. పైగా ఆమె సైతం సోషల్ మీడియా బాధితురాలని అని చెబుతుంటారు. చాలా సందర్భాల్లో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఇప్పుడు ఆమె అలా దురుసుగా మాట్లాడడం మాత్రం ఆమెకే ఇబ్బందికరం. ప్రతిపక్ష పార్టీగా స్పందించడంలో తప్పులేదు కానీ.. కొన్ని విషయాల్లో హుందాగా వ్యవహరించడం మాత్రం చాలా మంచిది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper