Homeఆంధ్రప్రదేశ్‌Prakash Raj: ప్రకాష్ రాజ్ మరి మారరా?

Prakash Raj: ప్రకాష్ రాజ్ మరి మారరా?

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పటివరకు సమకాలిన అంశాలపై ఆయన స్పందిస్తున్నారని అంతా భావించారు. కానీ క్రమేపి ఆయన రూట్ తప్పుతున్నారు. దేశం కోసం వ్యతిరేకంగా మాట్లాడే వారిని.. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే వారికి.. దైవదూషణలను చేసే వారికి… ప్రకాష్ రాజ్ మద్దతు తెలుపుతూ ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆయన బలమైన వ్యూహంతో ఉన్నట్టు అనిపిస్తోంది. తాజాగా జోసెఫ్ రావణ్ విషయంలో ప్రకాష్ రాజ్ […]

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పటివరకు సమకాలిన అంశాలపై ఆయన స్పందిస్తున్నారని అంతా భావించారు. కానీ క్రమేపి ఆయన రూట్ తప్పుతున్నారు. దేశం కోసం వ్యతిరేకంగా మాట్లాడే వారిని.. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే వారికి.. దైవదూషణలను చేసే వారికి… ప్రకాష్ రాజ్ మద్దతు తెలుపుతూ ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆయన బలమైన వ్యూహంతో ఉన్నట్టు అనిపిస్తోంది. తాజాగా జోసెఫ్ రావణ్ విషయంలో ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి విమర్శలకు గురిచేస్తోంది. పదే పదే వీడియోలను పోస్ట్ చేస్తూ.. జోసెఫ్ రావడం చేస్తున్నది కరెక్ట్ అన్నట్టు మాట్లాడడం మాత్రం తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది. ప్రకాష్ రాజ్ శైలి ఈ దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి, అంతకుమించి ఆధ్యాత్మిక నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నారని అర్థం అవుతోంది.

* మెగా కుటుంబానికి టార్గెట్..
ప్రకాష్ రాజ్ మంచి నటుడు. అది కాదనలేని సత్యం కూడా. ప్రకాష్ రాజ్ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం గుర్తించి మెగా కుటుంబం ఆయనకు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీలో పెట్టింది. సినీ పరిశ్రమ వ్యతిరేకించినా ప్రకాష్ రాజు విషయంలో స్ట్రాంగ్ గా నిలబడింది మెగా ఫ్యామిలీ. ఆయన కోసం చిత్ర పరిశ్రమలో తన పరపతిని వదులుకుంది. అటువంటి మెగా ఫ్యామిలీ పై ఇప్పుడు కత్తి కట్టినట్లు మాట్లాడుతున్నారు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేశారు జోసెఫ్ రావణ్. ఇప్పుడు ఆయన చేస్తున్నది కరెక్ట్ అన్నట్టు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు.

* ఉగ్రవాదులకు మద్దతు..
ఉగ్రవాదుల కు హక్కులు ఉన్నాయి అన్నట్టు వాదిస్తున్నారు ప్రకాష్ రాజ్. చేతిలో ఆయుధం పట్టుకొని.. ప్రత్యర్థిని సంహరించే వ్యక్తులకు సైతం హక్కులు ఉన్నాయంటూ కొత్త పలుకులు పలుకుతున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పటివరకు ఆయన భావజాలంలో స్పష్టమవుతోంది హిందుత్వ వ్యతిరేకం. ఆపై తప్పు చేసే వారిని.. తప్పులు మాట్లాడుతున్న వారికి అడ్డగోలుగా సమర్థిస్తున్నారు. అదే మంచి అని వాదిస్తున్నారు. తప్పులు చేసేవారిని సరిదిద్దుకోవాలని సూచించడం అసలైన మనిషి తత్వం. కానీ ఆ తప్పులను సమర్థించడం కాదు.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం మాత్రం ముమ్మాటికీ తప్పిదమే. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ మారకపోతే మాత్రం దోషికాక తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper