spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ దెబ్బతింది అక్కడే

Jagan: జగన్ దెబ్బతింది అక్కడే

Jagan: ఏపీలో జగన్ చేజేతులా నష్టాన్ని తెచ్చుకున్నారు. ఫోటోల పిచ్చితో ఎన్నికల ముంగిట విపక్షాలకు ప్రచార అస్త్రాలను అందించారు. అటు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ అంశం వైరల్ అయింది. ప్రజల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ బలంగా వెళ్తోంది. సీఎం జగన్ కు ఎవరు సలహా ఇచ్చారో? ఎవరు చెప్పారో తెలియదుకానీ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన ఫోటోలు ఉండాలని భావించారు. పార్టీ రంగులు వేసుకోవాలని చూశారు. అయితే మహిళలకు ఇచ్చే పథకాల నుంచి.. పింఛన్ పుస్తకాల వరకు.. అన్నింటి పైన సీఎం జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందే అన్న పంధాను కొనసాగించారు. రంగులు, ఫోటోల విషయంలో ఎప్పటికప్పుడు జగన్ కు చుక్కెదురవుతూ వచ్చింది. ఎన్నికల ముంగిట పట్టాదారు పాసు పుస్తకం పై జగన్ ఫోటో చాలా నష్టం కలిగిస్తోంది.

మొన్న ఆ మధ్యన భూ సర్వే కు సంబంధించి కొనుగోలు చేసిన సరిహద్దురాళ్లపై కూడా జగన్ ఫోటో వేశారు. ఏకంగా రాయిపై చిత్తరువులు వేయించారు. పొలానికి వెళ్లే రైతుకు జగనే కనిపిస్తారన్నది ఒక ఆరాటం. దీంతో చేసిన మేలు రైతులు గుర్తుపెట్టుకుంటారని భావించారు. అటు ప్రతి ఇంటా స్టిక్కర్ కూడా అతికించారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు.అయితే ఇంతవరకు ఓకే కానీ.. తమ ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోను వేయడాన్ని మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అదే పనిగా విపక్షాలు లేవనెత్తుతుండడంతో రైతులు, ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వినిపిస్తోంది. భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందన్నది చర్చకు దారితీస్తోంది. గతంలో ఏ ప్రభుత్వము ఇటువంటి సాహసం చేయకపోవడం.. జగన్ దానిని టచ్ చేయడం వివాదంగా మారింది. మీ ఆస్తులు దోచేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మీ ఆస్తులపై మీ ఫోటోలు కాకుండా.. జగన్ ఫోటోలు వేసుకున్నాడు అంటే అర్థం అదే.. అంటూ చంద్రబాబు, పవన్ లు విరుచుకుపడుతున్నారు. విపక్షాల నుంచి ఎదురవుతున్నఅభ్యంతరాలు ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సమాధానం లేకుండా పోతోంది. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టలేక చేతులు ముడుచుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి దాపురించింది.ఇప్పటివరకు ఉన్న సంక్షేమ వాదన, మీ బిడ్డ అనే వాదనలు పక్కకు వెళ్లిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోటోల రాజకీయం ఇప్పుడు ఏపీలో రంజుగా మారింది. జగన్ కు ఎనలేని నష్టం చేకూర్చేలా మారింది. మీ బిడ్డ మీ బిడ్డ అన్నాడు కాబట్టే.. మీ ఆస్తి తీసుకుంటాడు అంటూ.. అందులో తప్పేముందంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper