Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar Arrest: ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

Professor Nageshwar Arrest: ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

Professor Nageshwar Arrest: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి కారణమయ్యారు ప్రొఫెసర్ నాగేశ్వర్. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయని వివరించే ప్రయత్నం చేశారు నాగేశ్వర్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి విషయంలో అమిత్ షా క్లాస్ పీకినట్లు కూడా చెప్పుకొచ్చారు.. జగన్ నమ్మదగిన మిత్రుడు అని.. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అన్నట్టు కూడా విశ్లేషించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అయితే ఏపీ రాజకీయాల్లో ఇది దుమారానికి దారితీసింది. పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. టిడిపి శ్రేణులు కూడా మండిపడ్డాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అటు జనసేన సైతం ఇంతటితో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. అయినా సరే వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా స్పందించారు పవన్ కళ్యాణ్. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

* తెలంగాణ నేతల మద్దతు..
ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే ఆయనను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చాలామంది నాగేశ్వర్ కు మద్దతు ఇస్తున్నారు. యుద్ధం మీరు ప్రారంభించారు.. ముగింపు నేను ఇస్తానంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం సవాల్ చేశారు. హైదరాబాదులో ఏపీ పోలీసులు దిగారని.. ఈ క్షణంలోనైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. తాజా వివాదం నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణ కల్పిస్తున్నారు. అయితే అరెస్టులపై తెగ హడావిడి నడుస్తోంది హైదరాబాదులో. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్టుపై స్పందించి మాట్లాడారు.

* వదిలేయండి అంటూ తేలిగ్గా..
రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులతో వరుసగా సమావేశం అవుతూ వస్తున్నారు. ఇదే సమావేశంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. హద్దులు మీరు వ్యవహరిస్తే తాటతీస్తాం అంటూ హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న తరుణంలో మూడు రోజుల తర్వాత మళ్లీ స్పందించారు పవన్ కళ్యాణ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు సమాచారం తనకు వచ్చిందని.. వద్దని ఆదేశాలు ఇచ్చామని.. ఆయన సైతం మంచివాడు అని.. ఏదో ఆ సమయానికి అలా అనేసారు అంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదానికి పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు భావించాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper