Nadendla Manohar Audio Leak: ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు( Harihara Veera Mallu ) చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అయితే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం పై నెగిటివ్ ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అప్పటినుంచి అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉంది. సినిమా బాగాలేదు అంటూ ప్రచారం చేసింది. అయితే దీనిపై మండిపడ్డాయి జనసేన శ్రేణులు. అదే సోషల్ మీడియా ద్వారా జనసైనికులు సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సినిమాకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే జనసేనకు చెందిన మంత్రి పార్టీ శ్రేణులతో ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా.. జగన్ బ్రహ్మాస్త్రం!
గతంలో ఎన్నడూ లేని విధంగా..
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు ఎక్కువగా మాట్లాడారు. సినిమా విడుదలకు ముందు రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ఈ సినిమాను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేశారు. భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే సినిమా విడుదల తరువాత క్రమేపి హిట్ టాక్ వచ్చింది. అయితే అంతకుమించి వైసిపికి చెందిన సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయిందని ప్రచారం చేయడం మొదలు పెట్టింది. సినిమా గ్రాఫిక్స్ డిజైన్ లో సైతం లోపాలను బయటపెట్టింది. దీనిపై జన సైనికులు మండిపడ్డారు.
Also Read: సజ్జలను అనుమానిస్తున్న జగన్!
కామెంట్స్ వైరల్..
మరోవైపు ఈ సినిమా విషయంలో జరుగుతున్న విషప్రచారానికి చెప్పాలని జనసేన( janasena ) భావించింది. ఆ పార్టీకి చెందిన మంత్రి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఇదని.. దీనిని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని.. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలని.. అందరికీ చూపించాలని.. కూటమి పార్టీల సాయం తీసుకోవాలని నాదేండ్ల మనోహర్ సూచనలు చేశారు. అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో కూడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాను హిట్ చేసేందుకు ఇంతగా కృషి చేస్తున్నారు అంటూ వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. అయితే దీనిపై జనసైనికులు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది.
డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి
ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర… pic.twitter.com/Hr9uhO8uSE
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2025