PawanKalyan Health : గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, రీసెంట్ గానే హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. నేడు కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. 74 ఏళ్ళ వయస్సున్న చంద్రబాబు ఎంతో చలాకీగా తన పనులు తానూ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే, 50 ఏళ్ళు దాటిన పవన్ కళ్యాణ్ మాత్రం తరచూ అనారోగ్యానికి గురి అవుతూ రావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇలా జరుగుతుంది?, ఆయనకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్లే ఇలా అవుతుందా? అని అభిమానులు విశ్లేషిస్తున్నారు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే పవన్ కి చిన్నతనం నుండి నిమోనియా ఉంది. ఆ కారణం చేతనే ఆయన తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాడు. ‘ఓజీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనంత ఉత్సాహం తో కనిపించడం మనమంతా చూసాము. ఆయన ఉత్సాహాన్ని చూసి అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. ఆరోజున భారీ వర్షం ఉండడంతో పవన్ కళ్యాణ్ కాస్త వర్షం లో తడిచాడు. ఆ పక్క రోజు నుండి ఆయనకు ఇలా వైరల్ ఫీవర్ రావడం మొదలైంది. అస్వస్థతకు గురి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా, తన శాఖలకు సంబంధించి కీలకమైన రివ్యూస్ లు కూడా చేసాడు. ఇక ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడం తో డాక్టర్లు విశ్రాంతి అత్యవసరం అనడం తో హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు.
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు అని అనిపిస్తుంది. నేడు చంద్రబాబు నాయుడు ని తన నివాసం లో కలిసినప్పుడు కూడా చేతిలో కర్చీఫ్ పట్టుకొని దగ్గుతూనే ఉన్నాడు. వాస్తవానికి ఈ నెల 25 వ తేదీన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నారా లోకేష్ మెగా DSC లో ఉత్తీర్ణత సాధించిన వారికి అర్హత పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాడు. కానీ పవన్ కళ్యాణ్ కి తీవ్రమైన అస్వస్థత ఏర్పడడం తో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసాడు నారా లోకేష్. ఆయన ఎప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంటాడో, అప్పుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాడు. మరోపక్క ఓజీ నిర్మాతలు హైదరాబాద్ లో భారీ విజయోత్సవ సభ ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆయన కోలుకునే అవకాశం లేకపోవడం తో ఈ కార్యక్రమం కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.