Krish Jagarlamudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉండటమే కాకుండా సగటు మనిషి ఎలా ఉండాలి అనే మెసేజ్ ను ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి…ఇక రీసెంట్ గా ఆయన అనుష్కతో ఘాటి అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఘాటి సినిమా అనేది తనకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్టు అని, ఈ సినిమాతో తననుంటాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని చెప్పాడు. ఇక దానికి అనుగుణంగానే హరిహర వీరమల్లు సినిమా నుంచి తను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే కారణాన్ని కూడా తెలియజేశారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ రావడం దానివల్ల షూటింగ్ కి కొంత వరకు బ్రేకులు వచ్చాయి…అది క్లియర్ అయిన తర్వాత కూడా షూటింగ్ వేగంగా జరగపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను తప్ప వేరే ఏ కారణాలైతే లేవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టమని, ప్రేమని చెప్పాడు.
అలాగే ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం గారు అంటే కూడా చాలా గౌరవం ఉందని ఆయన చేసిన సినిమాలను చూస్తూ పెరిగానని చెప్పడం విశేషం… ఇక ఇదంతా చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంత చిన్న కారణంతో ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నావ్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
మరి ఏది ఏమైనా కూడా ఘాటి సినిమా ప్రమోషన్స్ లో తను శరవేగంగా పాల్గొంటూ సినిమా మీద హైప్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తనతో పాటు విక్రమ్ ప్రభు, జగపతిబాబు లాంటి వారు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉండడం విశేషం…మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 5 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…