Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Farm House Allegations: చివరకు పవన్ ఫామ్ హౌస్ పై పడుతున్నారు!

Pawan Kalyan Farm House Allegations: చివరకు పవన్ ఫామ్ హౌస్ పై పడుతున్నారు!

Pawan Kalyan Farm House Allegations: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో సరికొత్త కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ సమాజానికి తన సినిమా మాధ్యమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. గద్దర్ లాంటి ప్రముఖుడే తనకు పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్ మనస్తత్వాన్ని చెప్పే క్రమంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. విపత్తుల సందర్భంగా చేసే సాయం, […]

Pawan Kalyan Farm House Allegations: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో సరికొత్త కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ సమాజానికి తన సినిమా మాధ్యమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. గద్దర్ లాంటి ప్రముఖుడే తనకు పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్ మనస్తత్వాన్ని చెప్పే క్రమంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. విపత్తుల సందర్భంగా చేసే సాయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు.. ఇలా చాలా విషయాల్లో తెలంగాణ సమాజానికి తన వంతు సాయం అందించారు పవన్ కళ్యాణ్. ఉద్యమ సమయంలో సైతం అక్కడి భావోద్వేగాన్ని గౌరవించాలి తప్ప ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయలేదు. అటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఒక రకమైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* పవన్ చుట్టూ రాజకీయ కుట్ర..
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. కొందరు యూట్యూబర్లు మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పైపడ్డారు. అది చెరువు భూమి అని.. శిఖం భూమి అని ఏవేవో మాట్లాడుతున్నారు. అక్కడ నిర్మాణాలు జరపకూడదు అని.. కానీ ఆ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సమాచారం సేకరించి.. దానికి కొన్ని అసత్యాలు జోడించి ప్రచారం చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. వాస్తవానికి చట్టపరంగా, ప్రభుత్వ పరంగా అన్ని రకాల అనుమతులు తీసుకుని పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ తప్పుడు ప్రచారంపై ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయి.

* వైసిపి నేత అక్రమంపై తెరవని నోరు..
ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రలను బయటపెడుతున్నాయి. అయితే తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ ఏం సాయం చేశారో కూడా ఇప్పుడు బయట పడుతుంది. గద్దర్ తన భావోద్వేగానికి చెప్పిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండగట్టు అభివృద్ధికి నిధులు.. తెలంగాణ కళాకారులకు గుంప గుత్తిగా పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 1000 కోట్ల రూపాయల ఆస్తికి టెండర్ పెడితే కనీసం దాని ప్రస్తావన లేదు. తెలంగాణ ముసుగులో కొందరు చేస్తున్న ప్రచారం వెనుక మళ్లీ సెంటిమెంట్ అస్త్రం తీస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది. తెలంగాణ ముసుగులో జరుగుతున్న ఈ కుట్ర వెనుక అక్కడ ప్రతిపక్షం, ఏపీలో ఉన్న ప్రతిపక్షం ఉంది అనేది ఇట్టే తెలిసిపోతోంది. పవన్ కళ్యాణ్ వీటిని పట్టించుకోకపోవడం ద్వారా ధీటైన సమాధానం చెప్పినట్టు చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper