Homeఆంధ్రప్రదేశ్‌AP DSC 2026: లోకేష్ మరో డీఎస్సీ వరం.. ఏపీ నిరుద్యోగులూ సిద్ధంగా ఉన్నారా..

AP DSC 2026: లోకేష్ మరో డీఎస్సీ వరం.. ఏపీ నిరుద్యోగులూ సిద్ధంగా ఉన్నారా..

AP DSC 2026:ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. వేలాదిమంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరో వరాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చారు. వైసీపీ రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ.. వితండవాదాలు చేస్తున్నప్పటికీ లోకేష్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా చెప్తున్న.. చేస్తున్న అనే సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. వైసిపి పెడుతున్న ఇబ్బందులను పరిష్కరించుకుంటూనే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. మెగా డీఎస్సీ […]

AP DSC 2026:ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. వేలాదిమంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరో వరాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చారు. వైసీపీ రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ.. వితండవాదాలు చేస్తున్నప్పటికీ లోకేష్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా చెప్తున్న.. చేస్తున్న అనే సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. వైసిపి పెడుతున్న ఇబ్బందులను పరిష్కరించుకుంటూనే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు.

మెగా డీఎస్సీ తర్వాత.. మరోసారి వేలాది పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏకంగా రెండవ డీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రకటించి.. వేలాది పోస్టులను భర్త చేసింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి రెండవ నోటిఫికేషన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఫలితంగా నిరుద్యోగుల కలల పంట పండనుంది. ఉపాధ్యాయుల కొరతకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది.

రెండవ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2721 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో సాధారణ ప్రభుత్వ.. జిల్లా పరిషత్.. మండల పరిషత్.. మున్సిపల్ పాఠశాలలో ఉన్న 1205 సెకండరీ గ్రేడ్ టీచర్.. 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటితోపాటు దివ్యాంగుల ప్రత్యేక విభాగంలో 350 పోస్టులను.. విద్యాశాఖ పరిధిలో ఉన్న వివిధ సంక్షేమ సొసైటీలు.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న ప్రిన్సిపాల్.. పిజిటి.. టీజీటీ.. ఫిజికల్ డైరెక్టర్.. పిఈటి కేటగిరీలో ఉన్న 260 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్నికల హామీల్లో భాగంగా విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. డీఎస్సీ ఎంపిక విధానాన్ని వేగంగా.. పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఉంది. రిజర్వేషన్ వర్గాలకు సడలింపులు ఉంటాయి. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. స్కూల్ అసిస్టెంట్.. ఎస్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు 20% వెయిటేజీ.. రాత పరీక్షకు 80% వెయిటేజీ లభిస్తుంది.

అధికారులకు వచ్చిన కొద్దిరోజుల్లోనే వరుసగా రెండు నోటిఫికేషన్లను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. అదే కాదు నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తోంది. దీనిపై నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం హయాంలో డీఎస్సీ అనేది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను అమలు చేస్తోంది. అస్తవ్యస్తంగా మారిన విద్యారంగాన్ని దారిలో పెడుతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. పరీక్షకు సంబంధించిన సిలబస్ ఇప్పటికే పోర్టల్ లో అందుబాటులో ఉంది. నిరుద్యోగులు శిక్షణలో మునిగిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper