Homeఆంధ్రప్రదేశ్‌Pulivendula Municipality: పులివెందులలో జగన్ పాచికలు పారలేదు.. హైకోర్టు భలే దెబ్బకొట్టిందిగా..

Pulivendula Municipality: పులివెందులలో జగన్ పాచికలు పారలేదు.. హైకోర్టు భలే దెబ్బకొట్టిందిగా..

Pulivendula Municipality: పులివెందుల పురపాలకంలో ఓట్ల లెక్కింపును అడ్డుకోవాలని వైసిపి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఏకంగా కోర్టు దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. కానీ న్యాయస్థానం వారి పాచికలు పారనివ్వలేదు. పైగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది. పులివెందులలో ఎన్నికల ప్రక్రియ మొత్తం అక్రమంగా జరిగిందని.. పురపాలకమ్ పరిధిలో ఓట్ల లెక్కింపు వెంటనే నిలిపివేసి.. మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. […]

Pulivendula Municipality: పులివెందుల పురపాలకంలో ఓట్ల లెక్కింపును అడ్డుకోవాలని వైసిపి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఏకంగా కోర్టు దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. కానీ న్యాయస్థానం వారి పాచికలు పారనివ్వలేదు. పైగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది.

పులివెందులలో ఎన్నికల ప్రక్రియ మొత్తం అక్రమంగా జరిగిందని.. పురపాలకమ్ పరిధిలో ఓట్ల లెక్కింపు వెంటనే నిలిపివేసి.. మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి ప్రమీల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఏర్పడింది. లెక్కింపుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పులివెందులలో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు.

కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో వైసీపీ తరఫున న్యాయవాదులు వితండవాదం చేశారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు వైసీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారట. అక్రమాలు జరిగాయట. దానివల్ల కౌంటింగ్ నిలిపివేయాలట. ఇది న్యాయ సమ్మతమైన విషయమట. దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో వైసీపీ తరఫు న్యాయవాదులు విఫలమయ్యారు. అయితే ఎన్నికల సంఘం.. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దీనిని పూర్తిగా తప్పు పట్టారు. జిల్లా యంత్రాంగం అందించిన నివేదికలను న్యాయస్థానం పరిశీలించింది. వివాదాస్పదంగా ఉన్న బూత్ లలో రీ పోలింగ్ చేశామని అధికారులు వివరించారు. పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసిన నేపథ్యంలో లెక్కింపుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. రెండువైపులా వాదనలను హైకోర్టు పరిశీలించింది. అవినాష్ రెడ్డి.. ప్రమీల రెడ్డికి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది.

ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలింగ్ జరిగే వరకు పులివెందులలో రకరకాల ఆందోళనలు జరిగాయి. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రేపు పోలింగ్ జరగాలని ఆందోళనలు నిర్వహించారు. పోలింగ్ జరుగుతున్న రోజు జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. బహిష్కరణ అంటూ పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజకీయం అందరికీ అర్థమైంది. దీనికి తోడు లెక్కింపును పూర్తిగా నిలిపివేయాలని వైసిపి కోర్టు మెట్లు ఎక్కింది. చివరికి అక్కడ కూడా దిమ్మతిరిగే ఫలితం ఎదురయింది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల అధికారులు మున్సిపల్ అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులు తెరిచారు. ఇక పులివెందులలో ప్రజా తీర్పు ఎలా వస్తుందనేది మరి కొద్ది క్షణాల్లో తేలిపోతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper