Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: మోదీని గౌరవిస్తే తట్టుకోలేకపోతున్న కొడాలి నాని!

Kodali Nani: మోదీని గౌరవిస్తే తట్టుకోలేకపోతున్న కొడాలి నాని!

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని తీరు మారలేదు. నిన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ పాత పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు. పెద్దవారిని గౌరవిస్తే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగూ మాట్లాడరు. ఇప్పుడు పెద్ద వారిని గౌరవిస్తే తప్పు అని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో సీఎం చంద్రబాబు, లోకేష్ నమస్కరించి గౌరవించడమే తప్పు అన్నట్టు.. తప్పుపడుతున్నారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ […]

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని తీరు మారలేదు. నిన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ పాత పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు. పెద్దవారిని గౌరవిస్తే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగూ మాట్లాడరు. ఇప్పుడు పెద్ద వారిని గౌరవిస్తే తప్పు అని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో సీఎం చంద్రబాబు, లోకేష్ నమస్కరించి గౌరవించడమే తప్పు అన్నట్టు.. తప్పుపడుతున్నారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ విషయంలో సైతం గౌరవభావంతో చూస్తున్న చంద్రబాబు, లోకేష్ పై నోరు పారేసుకున్నారు. పైగా తన చేష్టలతో చేసి చూపించారు కూడా. అయితే అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్న కొడాలి నాని తర్వాత మాత్రం సైలెంట్ అవుతున్నారు.

* పూర్తిగా అజ్ఞాతంలోకి..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్దిరోజుల పాటు కనిపించకుండా మానేశారు కొడాలి నాని. తర్వాత బయటకు వచ్చారు. కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కేసులతో సిద్ధపడిన తరుణంలో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతలో అనారోగ్యానికి కూడా గురయ్యారు. ముంబైలో బైపాస్ సర్జరీ చేసుకున్నారు. చాలా రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. మళ్లీ అదే మాటలు చెబుతూ చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

* గతంలో జగన్ సైతం..
తన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నారు. చంద్రబాబును మాత్రం ఏక వచనంతో మాట్లాడుతున్నారు. ఇంత జరిగాక కూడా కొడాలి నానిలో ఎంత మాత్రం ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. కనీసం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోడీని గౌరవించడాన్ని కూడా సహించలేకపోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునే క్రమంలో వినమ్రతతోనే నమస్కారం చేసేవారు. సాగిలాలు పడినంత పని చేసేవారు. ఇప్పుడు ఈ దేశ ప్రధానిగా చంద్రబాబుతో పాటు లోకేష్ మోదిని వినమ్రతతోనే నమస్కరిస్తున్నారు. దానిని కూడా సహించుకోలేక కొడాలి నాని లేనిపోని మాటలు ఆడుతున్నారు. నిజంగా ఇది బాధాకరం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper