spot_img
Homeట్రెండింగ్ న్యూస్Maharashtra: మహారాష్ట్రలో వ్యక్తిపై పిడుగు.. దడ పుట్టిస్తున్న వీడియో..!

Maharashtra: మహారాష్ట్రలో వ్యక్తిపై పిడుగు.. దడ పుట్టిస్తున్న వీడియో..!

Maharashtra: పిడుగు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. సాధారణంగా పిడుగు మన కంటికి కనిపించదు. దాని శబ్దం వింటేనే చెవులు చిల్లు పడినట్లుగా అనిపిస్తుంది. ఎత్తయిన చెట్లపై మంటలు లేచినప్పుడు పిడుగు పడిందని భావిస్తాం. సెకన్లలో ప్రాణం తీసేస్తుంది. ఓ మెరుపులా ఉన్నా.. అది తాకితే వేల ఓట్ల విద్యుత్‌ ఒంట్లోకి చేరి క్షణాల్లో మనిషిని బూడిద చేస్తుంది. మహారాష్ట్రలో పడుగుపాటు దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు పడడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై..
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో బొగ్గుగనిలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై పిడుగు పడింది. దీంతో అతను స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ విషాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చంద్రాపూర్‌ జిల్లా భద్రావతి తాలూకా మజ్రీ బొగ్గు గనిలో పని చేస్తున్న కార్మికుడు.. పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది. పిడుగు ధాటికి బాధిత కార్మికుడు.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బీహార్‌కు చెందిన బాబుధన్‌యాదవ్‌గా గుర్తించారు.

కారణం ఏంటి?
సాధారణంగా పిడుగులు ఎత్తయిన భవనాలు, చెట్లపైనే పడుతుంది. అందుకే వర్షం కురిసినప్పుడు చెట్ల కింద నిలబడొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. కాగా, నేలపై ఏదైనా లోహం ఉంటే మాత్రమే పిడుగును ఆకర్షిస్తుంది. అయితే చంద్రాపూర్‌లో జరిగిన పిడుగుపాటు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడింది. దీనిపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిడుగ పడినప్పుడు వ్యక్తి చేతిలో పిడుగును ఆకర్షించే వస్తువు ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. లేదంటే అతను నడుచుకుంటూ వెళ్లే ప్రాంతలో భూమి లోపలై ఏదైనా లోహం ఉండి పిడుగును ఆకర్షించి ఉంటుందా అని భావిస్తున్నారు.

సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన ఈ పిడుగుపాటు దృశ్యాలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు తమకు భయంతో గుండె దడ మొదలైందని కామెంట్లు పెడుతున్నారు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper