Homeఆంధ్రప్రదేశ్‌Janasena Key Appointments: జనసేనలో కీలక నియామకాలు!

Janasena Key Appointments: జనసేనలో కీలక నియామకాలు!

Janasena Key Appointments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో 11 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కమిటీలు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతాయి. హై కమాండ్ కు నివేదికలు అందిస్తాయి. త్వరలో 175 నియోజకవర్గాల ఇన్చార్జిలతో పాటు జిల్లాల అధ్యక్షులను సైతం […]

Janasena Key Appointments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో 11 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కమిటీలు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతాయి. హై కమాండ్ కు నివేదికలు అందిస్తాయి. త్వరలో 175 నియోజకవర్గాల ఇన్చార్జిలతో పాటు జిల్లాల అధ్యక్షులను సైతం నియమిస్తారు. అంతకుముందు జిల్లాల వారీగా బాధ్యతలు కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. పార్టీలో సీనియర్లతో పాటు ఎమ్మెల్యేలకు సైతం ఈ కమిటీలు స్థానం కల్పించారు. ప్రాంతాలవారీగా నేతలకు ఈ బాధ్యతలు కట్టబెట్టారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన లోకి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను కు సైతం బాధ్యతలు కట్టబెట్టారు.
* ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆరణి శ్రీనివాస్, టిసి వరుణ్ లను నియమించారు.
* ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా బాధ్యతలను కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు.
* పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల బాధ్యతలను పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావు లకు అప్పగించారు.
* ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభానులకు అప్పగించారు.
* వచ్చేవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులను నియమించనున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper