Homeఆంధ్రప్రదేశ్‌Balineni Srinivasa Reddy: బాలినేని పై ఆ ప్రచారానికి చెక్ పెట్టిన పవన్

Balineni Srinivasa Reddy: బాలినేని పై ఆ ప్రచారానికి చెక్ పెట్టిన పవన్

Balineni Srinivasa Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే చేరి చాలా రోజులు అవుతున్న జనసేనలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎటువంటి పదవి కూడా దక్కలేదు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. బాలినేని భార్యతో పాటు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి మళ్లీ పార్టీలోకి వస్తామని విజ్ఞప్తి చేసినట్లు కూడా ప్రచారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదన్న టాక్ కూడా వచ్చింది. ఎందుకంటే బాలినేని జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. దీంతో బాలినేని మరోసారి జగన్మోహన్ రెడ్డి గూటికి చేరిపోతారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే దానికి చెక్ చెబుతూ పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మరో ఇద్దరి నేతలతో కలిసి దాదాపు 6 జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు డీ లిమిటేషన్ పై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో బాలినేనికి చోటిచ్చారు.

* సుదీర్ఘ నేపథ్యం..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్ లో ఉన్న బాలినేనికి అలా అవకాశం దక్కింది. 2009లో రెండోసారి పోటీ చేసిన ఆయనకు విజయం దక్కడంతో మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఇంతలోనే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం.. తర్వాత కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడంతో.. మంత్రి పదవిని వదులుకొని మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ వెంట అడుగులు వేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కట్టబెట్టారు బాలినేనికి.

* వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం
బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనూహ్య పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన చాలా రోజుల తర్వాత ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జగన్మోహన్ రెడ్డిని విభేదించి మరి పార్టీలో చేరిన ఆయన అదే జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ఏ పదవి ఆశించి జనసేనలో చేరారో తెలియదు కానీ.. బాలినేనికి అనుకున్నంత ప్రాధాన్యత తగ్గలేదు జనసేనలో. తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరిగింది. ఒకరిద్దరూ పెద్దలు కలుగజేసుకుని తిరిగి బాలినేనిని వైసీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఇచ్చింది. అటు బాలినేని రాకను జనసేన వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే సైతం వ్యతిరేకిస్తున్నారు. పెద్దగా ప్రభుత్వంలో ప్రాధాన్యం లేకుండా పోవడంతో బాలినేని తిరిగి వైసీపీలో చేరుతారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఆరు జిల్లాల బాధ్యతలను ఆయనకు కట్టబెట్టడం చూస్తుంటే.. మున్ముందు మరిన్ని బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular