YSR Congress Covert Controversy: ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో అనుమానాలు పెరుగుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో కోవర్టులు ఉన్నారంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. దీంతో నేను కాదు అంటే నేను కాదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందట. ఒకప్పుడు విశ్వాసానికి, విశ్వసనీయతకు తాడేపల్లి ప్యాలెస్ పెట్టింది పేరు. అధికారంలో ఉన్నప్పుడు వెలుగులతో కలకలలాడింది ఆ ప్రాంగణం. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు అనుమానపు చూపులు చూసేదాకా వచ్చింది పరిస్థితి. కోవర్టు ఉన్నారు సరే.. ఇంతకీ ఎవరు? అనేది ఇప్పుడు ప్రశ్న. తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. పనిలో పనిగా వైసీపీ సెల్ఫ్ గోల్స్ పై కూడా చర్చి నడుస్తోంది. ఈ క్రమంలో తాడేపల్లిలో టిడిపి కోవర్టు ఉన్నారన్నది కొత్త ప్రచారం మొదలైంది.
* అదృశ్య వ్యక్తి ఎవరు
అయితే తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి సంబంధించిన కోవర్టు ఉన్నారని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరిలోనే ఆ వ్యక్తి ఉన్నాడంటూ కొత్త అనుమానం పెరుగుతోంది. ఈ అదృశ్య హస్తం ఎవరో తేల్చకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం. అందుకే ఇప్పుడు ఆ కోవర్ట్ కోసం వైసిపి నాయకత్వం సెర్చింగ్ ఆపరేషన్ మొదలెట్టిందట. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న క్యాడర్ సహకరించేది. కానీ తొలిసారిగా మావిగన్ ప్రతిపాదనకు పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. 2014లో అమరావతికి మద్దతు పలికి.. 2019 ఎన్నికలకు ముందు అదే స్టాండ్ మీద ఉండి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అని చెప్పి.. ఇప్పుడు మళ్లీ మావిగన్ అనడం వెనుక ఎవరు ఉన్నారు అనేది వైసీపీ శ్రేణుల్లోనే కొత్త ప్రశ్న. టిడిపికి లాభం చేకూర్చే సలహాదారుడు ఎవరైనా వైసిపి కేంద్ర కార్యాలయంలో ఉన్నారా అని వెతికే పనిలో ఉందట నాయకత్వం. జగన్మోహన్ రెడ్డితో ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్న వారు ఎవరబ్బా అంటూ పార్టీ శ్రేణులే పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారట.
* గుణపాఠాలు నేర్చుకోలే..
ఏదైనా ఒక అంశం నష్టం చేకూరుస్తే దానిని గుణపాఠంగా మార్చుకుంటాయి రాజకీయ పార్టీలు. అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. దానిని గుణపాఠంగా మార్చుకోలేకపోయింది వైసీపీ నాయకత్వం. రాజధానుల అంశం అనేది ఆ పార్టీకి అంతగా మైలేజ్ తేలేదు సరి కదా డ్యామేజ్ చేసింది. ఇటువంటి సమయంలో సైలెన్స్ గా ఉండాల్సింది పోయి.. మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ప్రతిపాదనతో భారీ డ్యామేజ్ జరిగింది పార్టీకి. అందుకే ఇప్పుడు సలహాదారుడు పాత్రల్లో ఉన్నవారిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆ కోటరిలోనే టిడిపికి కోవర్టులు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు బలంగా పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబుకు ప్లస్ అవుతున్నాయి. ఆయాచితంగా రాజకీయ లభించే కురుస్తున్నాయి.
* కంటెంట్ తో పాటు స్క్రిప్ట్ పై చర్చ..
స్క్రిప్టు లేనిదే జగన్ మోహన్ రెడ్డి చదవలేరు. భావాన్ని వ్యక్తీకరించలేరు కూడా. అందుకే ఇప్పుడు స్క్రిప్ట్ ఎవరూ రాస్తున్నారు అనేది కొత్త ప్రశ్న. మొన్నటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిన స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి చదివే వారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని కొత్త టాప్ మొదలైంది. అయితే ఈ మావిగన్ ప్రతిపాదనతో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపికి భారీ డామేజ్ జరిగింది. అందుకే ఇప్పుడు కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? స్క్రిప్ట్ ఎవరూ రాస్తున్నారు? అనే దానిపై లోతైన చర్చ నడుస్తోంది. సుదీర్ఘకాలం వైసీపీని నడిపించిన జగన్మోహన్ రెడ్డి ఒకరు ట్రాప్ లో పడతారా అనే అనుమానం కూడా వెంటాడుతోంది. మరి ఏం జరిగిందో దేవుడికి తెలియాలి.