Homeఆంధ్రప్రదేశ్‌IBM returns to Visakhapatnam: నమ్మకం కుదిరింది.. విశాఖకు ఆ ఐటీ సంస్థ యూటర్న్!

IBM returns to Visakhapatnam: నమ్మకం కుదిరింది.. విశాఖకు ఆ ఐటీ సంస్థ యూటర్న్!

IBM returns to Visakhapatnam: ఏపీకి ( Andhra Pradesh) పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు విశాఖకు వెల్లువలా వస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో విశాఖ నుంచి వెళ్లిపోయిన సంస్థలు సైతం తిరుగు ముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ దిగ్గజ సంస్థ ఐబీఎం తిరిగి విశాఖలో అడుగు పెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కూటమి ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల పుణ్యమా అని విశాఖ నుంచి గతంలో వెళ్లిపోయిన సంస్థలు సైతం తిరిగి వస్తుండడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వం ఆశిస్తున్నట్టు మాదిరిగా విశాఖ నగరం మళ్లీ గ్లోబల్ ఐటీ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో.. దాని అనుబంధ సంస్థలు ఒక్కొక్కటి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో విశాఖ వీడి వెళ్లిన ఐబీఎం రెట్టింపు ఉత్సాహంతో విశాఖకు తిరుగు ముఖం పట్టడం విశేషం.

గత ప్రభుత్వ హయాంలో తరలింపు..
దశాబ్దాల కిందట విశాఖలో ఐబీఎం( IBM) ఏర్పాటయింది. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను వదిలి వెళ్ళింది సదరు సంస్థ. రుషికొండ హిల్ 3 పై కేటాయించిన స్థలంలో ఐబీఎం కార్యకలాపాలు నిర్వహించేది. అయితే వైసిపి ప్రభుత్వం కొన్ని నిబంధనలు తెరపైకి తేవడంతో అప్పట్లో ఐబీఎం విశాఖ నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఐబీఎం వెనక్కి ఇచ్చిన సుమారు 21 ఎకరాల స్థలాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరో దిగ్గజ ఐటీ సంస్థ టిసిఎస్ కు కేటాయించింది. అయితే తాజాగా ఐబీఎం సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. తద్వారా కేవలం విశాఖలో కార్యాలయం ఏర్పాటుకే పరిమితం కాకుండా.. భారీ ఎగుమతుల లక్ష్యంతో రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న మూడేళ్లలో విశాఖ కేంద్రంగా సుమారు రూ.321 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం!

భారీగా ఉద్యోగాలు..
ఐబీఎం రాకతో విశాఖలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ నిపుణులకు భారీగా అవకాశాలు లభించునున్నాయి. సుమారు 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. ఇప్పటికే కార్యాలయ భవన ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో ఐబీఎం విశాఖ నగరాన్ని వీడింది. ఇప్పుడు తిరిగి రావడం ద్వారా సరికొత్త సంకేతాలు పంపించింది. నగరంపై పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని అనిపిస్తోంది. మరోవైపు ఐబిఎంతో పాటు ప్రపంచ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోంది. అయితే ఇప్పటివరకు అద్దె భవనాల్లో డీసీఎస్ కొనసాగుతోంది. పెరిగిన ఐటీ సంస్థలతో సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో టిసిఎస్ శాశ్వత భవనం దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి అయితే విశాఖ నగరానికి వరుసగా శుభవార్తలు అందుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper