Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi hit movie remake by Rajinikanth: చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేయాలనుకున్న రజినీకాంత్......

Chiranjeevi hit movie remake by Rajinikanth: చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేయాలనుకున్న రజినీకాంత్… మోహన్ బాబు ఏం చెప్పాడంటే.?

Chiranjeevi hit movie remake by Rajinikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. రీసెంట్ గా చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని చాలామంది కొనియాడుతున్నారు. ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. చిరంజీవి కెరియర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం… తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న రజినీకాంత్ సైతం ఒకానొక సమయంలో చిరంజీవిని చూసి భయపడ్డాడట… ఈ విషయాన్ని స్వయంగా రజినీకాంత్ చెప్పడం విశేషం…ఇక తమిళంలో సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ చిరంజీవి క్రేజ్ చూసి, ఆయన టాలెంట్ ను చూసి కొద్దిగా భయపడ్డాడు. అంటే చిరంజీవికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రజనీకాంత్ కి బాగా నచ్చిందట. దాంతో ఈ మూవీ ని తమిళంలో రీమేక్ చేయాలని అనుకున్నారట. దానికి చిరంజీవితో కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. కానీ మధ్యలో రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చి అది చిరంజీవికి సెట్ అయింది కానీ నీకు సెట్ అవ్వదని చెప్పడంతో రజనీకాంత్ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ సినిమాని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని తమిళంలో డబ్బింగ్ చేసి వదిలారు. మరి రజినీకాంత్ కనక ఈ సినిమాను చేసి ఉంటే ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదని తద్వారా తన స్టార్ డం మరింత పెరిగేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు.

నిజానికి మోహన్ బాబు రజనీకాంత్ ని అడ్డుకోవడం వల్ల రజనీకాంత్ ఆగిపోయాడని కాదు. ఆ తర్వాత కొంతమంది దర్శకులు సైతం రజనీకాంత్ తో ఆ విషయాన్ని చెప్పారట. అది తెలుగులో ఆడింది కానీ తమిళంలో పెద్దగా ఆడకపోవచ్చు అని చెప్పడంతో ఆయన ఈ మూవీని రీమేక్ చేయాలనే నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: స్టార్ హీరోలు సినిమాల్లోనే నీతులు చెప్తారా..? బయటంతా బూతేనా..?

ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ మోహన్ బాబు ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్ల తన ఫ్రెండ్ కి ప్లాప్ సినిమా రావద్దనే ఉద్దేశ్యంతోనే మోహన్ బాబు ముందు జాగ్రత్తగా రజనీకాంత్ కి విషయమైతే చెప్పారట. రజినీకాంత్ ఆ సినిమా చేసి ఉంటే సక్సెస్ అయ్యేదా? ఫెయిల్యూర్ అయ్యేదా అనేది తర్వాత విషయం గాని రజినీకాంత్ కి ఒక పవర్ ఫుల్ పాత్ర చేసే అవకాశమైతే దక్కేది.

మొత్తానికైతే ఈ సినిమా చేయకుండా ఆగిపోవడం అనేది అప్పట్లో రజినీకాంత్ అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత రజనీకాంత్ చేసిన భాషా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి తన సత్తా చాటుకున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper