Homeఆంధ్రప్రదేశ్‌Ravi Prakash Emotional Reaction: ఒకప్పటి టీవీ9 రవి ప్రకాష్ కు ఏమైంది.. ఎందుకు ఇంత...

Ravi Prakash Emotional Reaction: ఒకప్పటి టీవీ9 రవి ప్రకాష్ కు ఏమైంది.. ఎందుకు ఇంత కదిలిపోయాడు.. కన్నీరు పెట్టుకున్నాడు..

Ravi Prakash Emotional Reaction: ఎలక్ట్రానిక్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి రవి ప్రకాష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు సరికొత్త దశ దిశ చూపించాడు. 24 గంటలపాటు వార్త ఛానల్ అంటూ టీవీ9 ను రవి ప్రకాష్ ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అది ఎలా సాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడు చూపించిన తోవలో చాలామంది నడుస్తున్నారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో టీవీ9 తర్వాత.. టీవీ9 ముందు అని చెప్పుకోవచ్చు. దీనంతటికీ ప్రధాన కారణం రవి ప్రకాష్.

రవి ప్రకాష్ అంతకుముందు తేజ చానల్లో పని చేశాడు. ఎన్కౌంటర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాడు. తద్వారా ఎలక్ట్రానిక్ మీడియా నాడి పట్టుకున్నాడు. టీవీ9 ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత.. రవి ప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ అధికారుల కంటే.. టీవీ9 కు ఫోన్ చేస్తే పనులు జరిగిపోతాయని ప్రజలు అనుకునేవారంటే.. అతడు చూపించిన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీవీ9 నుంచి బయటికి వచ్చిన తర్వాత రవి ప్రకాష్ రకరకాల మీడియా సంస్థలను ఏర్పాటు చేశారు. మోజో టీవీ మూతపడింది. ఆ తర్వాత కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఒత్తిడి ఎదురుకోవాల్సి వచ్చింది. చివరికి తన స్థాపించిన టీవీ 9 ఛానల్ నుంచే అపరాధ భావంతో బయటికి రావాల్సి వచ్చింది. చివరికి రవి ప్రకాష్ ఇప్పుడు ఆర్ టీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్.. తొలి వెలుగు.. మెరుపు అనే పేరుతో పిడిఎఫ్ న్యూస్ పేపర్ నిర్వహిస్తున్నారు. సంచలన వార్తలతో నిత్యం చర్చల్లో ఉంటున్నారు రవి ప్రకాష్.

తాజాగా రవి ప్రకాష్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక గిగ్ వర్కర్ కన్నీటి కథ ఉంది. ఆర్థిక కష్టాలు తట్టుకోలేక అతడు బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు. అయితే అతడు బిల్డింగ్ పైనుంచి చనిపోతున్నప్పుడు అక్కడి సన్నివేశాలు కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. అవి కాస్త బయటకు వచ్చాయి. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ రవి ప్రకాష్ తీవ్రంగా బాధపడ్డాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. గుండె బరువెక్కి పోయిందని వ్యాఖ్యానించాడు.

ఆ వ్యాఖ్యలు చదువుతుంటే రవి ప్రకాష్ గుండెలో ఇంత ఆవేదన ఉందా.. అతడు కూడా కన్నీరు పెడతాడు.. ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాడు కదా.. ఇతడికి ఏమైంది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎంతటి కఠినమైన మనిషి అయినప్పటికీ.. ఎంతటి స్థిర చిత్తమున్న వ్యక్తి అయినప్పటికీ.. ఏదో ఒక సందర్భంలో కన్నీరు పెట్టాలి. బాధపడాలి. ఎంతమందిని ఇలా ఏడిపించాడో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం రవి ప్రకాష్ మారిపోయాడు. మనిషిలాగ కనిపిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper