Suva Dai Story: ఆమె పేరు మోసిన విశ్వవిద్యాలయాలలో చదివిన డాక్టర్ కాదు. రోగులను చిరునవ్వుతో పలకరించి.. వారికి సేవలు చేయడంలో తరఫున నర్స్ కాదు. ఆమెకు స్టెత్ అంటే ఏంటో తెలియదు. కానీ గర్భిణుల నాడి ఇట్టే తెలుసుకుంటుంది. ఎటువంటి స్థానికులు చేయకుండానే అమ్మ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితిని కచ్చితంగా చెప్పేస్తుంది. నేటి కాలంలో కూడా ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉందంటే దానికి ప్రధాన కారణం ఆమె నేర్పరితనం
అది రాజస్థాన్ రాష్ట్రం.. ఇక్కడ అజ్మీర్లోని 84 సంవత్సరాల సువా దైమా మహిళ జీవిస్తూ ఉంటుంది. గడిచిన 60 సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తోంది. ఆమెను ప్రజల డాక్టరమ్మ అని పిలుస్తుంటారు.. ఇలా ఆమె డాక్టరమ్మ కావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అజ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్పత్రులు ఉండేవి కావు.
ఇలాంటి సమయంలోనే సువా దై తనకు 24 సంవత్సరాల వయసులో మొదటిసారి ఒక గర్భిణికి పురుడు పోసింది. అప్పుడు ఒక పండంటి బాబు పుట్టాడు. అప్పటినుంచి చుట్టుపక్కల వారు ఆమెతో పురుడు పోయించుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు అనుభవం.. జ్ఞానం ఎక్కువ ఉండడంతో గర్భిణుల నాడి చెక్ చేసేది. గర్భధారణను కూడా నిర్ధారించేది. గర్భం ధరించిన తర్వాత మహిళలకు జాగ్రత్తలు చెప్పేది. ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించేది.
అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ప్రసవాలు చేసేది. ఎవరింట్లోనైనా నొప్పులు మొదలయ్యాయి అనే మాట వినగానే వెంటనే ఎక్కడికి వెళ్లి పోతూ ఉంటుంది. పనులు మొత్తం పక్కన పెట్టి ప్రసవం చేస్తూ ఉంటుంది. అప్పట్లో అయితే దీపం వెలుతురులోనే ప్రసవాలు చేసేదట. అయితే ఇన్ని చేసినప్పటికీ ఆమె ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇతర కానుకలు కూడా స్వీకరించదు..”అమ్మ అనే పిలుపు అత్యంత గొప్పది. అమ్మదనం అత్యంత విలువైనది. ప్రతి ఆడపిల్ల అమ్మకావడం ఆమె జీవితంలో ఒక మధుర ఘట్టం. బిడ్డ పుట్టిన తర్వాత మహిళ ఈ ప్రపంచాన్ని జయించినంత గొప్పగా భావిస్తూ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి కళ్ళల్లో కలిగే ఆనందం నాకు గొప్పగా అనిపిస్తూ ఉంటుందని” సువా చెబుతూ ఉంటుంది .కాగా ఇటీవల ఆమె చనిపోయింది.

