spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Former TDP MP Galla Jayadev: రాజ్యసభ పై టిడిపి మాజీ ఎంపీ కన్ను!

Former TDP MP Galla Jayadev: రాజ్యసభ పై టిడిపి మాజీ ఎంపీ కన్ను!

Former TDP MP Galla Jayadev: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల కోలాహాలం మొదలైంది. వచ్చే ఏడాది జూన్ లో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. కచ్చితంగా ఆ నాలుగు పదవులు టిడిపి కూటమికి దక్కనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆశావాహులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తాజాగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని హింట్ ఇచ్చారు. తెలంగాణ పెట్టుబడుల సదస్సుకు అమర్ రాజా ప్రతినిధిగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలో రీయంట్రి ఖాయమని తేల్చేశారు. దీంతో రాజ్యసభ సభ్యుడిగా గల్లా జయదేవ్ పేరు ప్రకటిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి.

జూన్లో పదవీ విరమణ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని తో పాటు టిడిపి సభ్యుడు సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వాలు వచ్చే నెల జూన్ తో ముగియనున్నాయి. దీంతో ఎన్నికలు రానున్నాయి. అయితే ఇందులో పరిమల్ నత్వాని బిజెపి కోటాకు చెందిన వారు కావడంతో అదే పార్టీకి ఒక పదవి వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జనసేనకు రాజ్యసభ లో ప్రాతినిధ్యం లేదు. గతంలో చివరి వరకు ఉన్న ఆ పార్టీ పేరు సమీకరణల రూపంలో తెరమరుగయింది. చివరి నిమిషం వరకు ఆశావహుడిగా ఉన్న నాగబాబు కు ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ఆయనను ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.

గట్టి నమ్మకంతోనే..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి కచ్చితంగా రెండు రాజ్యసభ సీట్లు వస్తాయి. అయితే ఏడాది కిందట వైసీపీ సభ్యుల రాజీనామాతో ఉప ఎన్నిక రాగా టిడిపి తరఫున సానా సతీష్ ఎంపికయ్యారు. అయితే ఏడాదికే ఆయన పదవీకాలం పూర్తి కావడంతో మరోసారి ఆయన ఎంపిక ఖాయం. అయితే ఇంకో రాజ్యసభ పదవికి టిడిపిలో విపరీతమైన పోటీ ఉంది. తాజాగా గల్లా జయదేవ్ వ్యాఖ్యలతో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గల్లా అరుణకుమారి తన కుమారుడు జయదేవ్ తో కలిసి టిడిపిలో చేరారు. 2014లో తొలిసారిగా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు జయదేవ్. 2019 ఎన్నికల్లో సైతం జగన్ ప్రభంజనంలో గెలిచారు. కానీ 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు జయదేవ్. అయితే తెలుగుదేశం పార్టీతో ఇప్పటికీ అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. కూటమి గెలిచిన తర్వాత గల్లా జయదేవ్ కు కీలకమైన పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు రాజ్యసభ పదవి ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper