Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్

Pawan Kalyan: పవన్ కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్

Pawan Kalyan: ఏపీలో అసలు ఘట్టం ప్రారంభం కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మరింత ఊపందుకోనుంది. ఒకవైపు ఎన్నికల వ్యూహాలు, మరోవైపు పార్టీల్లో చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు పెరుగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో హీరోల అభిమానులు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలోని హీరోల అభిమానులంతా తనకు మద్దతు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తాను అందరి హీరోలతో బాగానే ఉంటానని… ఎవరితో తనకు విభేదాలు లేవని.. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని అందరి హీరోల అభిమానులకు పవన్ పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు.

అయితే తాజాగా కొందరు హీరోల అభిమానులు పవన్ కు షాక్ ఇచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో చేరారు. ప్రధానంగా విశాఖలో ఆ ఇద్దరు హీరోల అభిమానులు మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో వైసీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా మెగా అభిమానులంతా పవన్ కు అండగా నిలుస్తారు. మొన్నటికి మొన్న జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా అభిమానులకు చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపారు. కానీ అందుకు విరుద్ధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిర్ణయం తీసుకోవడం విశేషం.

చాలా సందర్భాల్లో ప్రభాస్ అభిమానులు సైతం తనకు అండగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సుదీర్ఘకాలం బిజెపి లోనే కొనసాగారు. ఒకానొక దశలో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి బిజెపి తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ఉన్న కూటమికే ప్రభాస్ అభిమానులు మద్దతు పిలుస్తారని అంతా భావించారు. కానీ విశాఖలో ప్రభాస్ అభిమానులు పవన్ కు జలక్ ఇచ్చారు. వైసీపీలో చేరిపోయారు. జగన్ నేతృత్వంలోనే విశాఖ జిల్లా అభివృద్ధి సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే ఇద్దరు హీరోల అభిమానులు యూటర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper