CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తే చాలు ఆయన అభిమానుల్లో వెయ్యి వోల్టుల ఎనర్జీ పాస్ అవుతుంది. తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆ ప్రకంపనలు అలా వెళ్తూనే ఉంటాయని సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి వారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ హీరో కి అయినా క్రేజ్ లో కాస్త మార్పులు రావడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సినిమాల్లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఆయన క్రేజ్ ఇంకా ఎక్కువ అయ్యిందని చెప్పొచ్చు. ఆ క్రేజ్ కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీలకు కూడా చిరాకు కలిగించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్ , నాగబాబు వంటి వారు అభిమానుల అరుపులు, గోలలు తట్టుకోలేక పవన్ ఫ్యాన్స్ పై మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రాజకీయ సభల్లో కూడా ఇంతే. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భం లో అభిమానుల పై చిరాకు పడ్డాడు. సరిగ్గా ఇలాంటి సందర్భం నేడు కూడా ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు మదనపల్లి లో జరిగిన హార్టీ కల్చర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పాల్గొన్నారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ అభిమానుల మేనియా మామూలు రేంజ్ లో కనపడలేదు. ఆయన పేరు ఎత్తినప్పుడల్లా సభా ప్రాంగణం దద్దరిలిపోయింది. ముఖ్య అతిధుల్లో ఒకరైన అనంత్ అంబానీ కూడా పవన్ క్రేజ్ చూసి షాక్ అయ్యాడు. అయితే నిర్మల సీతారామన్ మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ రచ్చ చేయడం తో ఆమె కాస్త ఇబ్బంది పడింది. ఇది గమనించిన సీఎం చంద్రబాబు , వెంటనే మైక్ అందుకొని గోల చేస్తున్న వారిపై సీరియస్ అయ్యి అదుపులోకి తీసుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
‘నేను, పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాము , కానీ నిర్మల సీతారామన్ గారు రారు , ఆమె కేంద్ర మంత్రి. ఆమె నేడు విలువైన సందేశాన్ని అందించడం కోసం ఇక్కడికి వచ్చారు. మేము కావాలంటే ప్రత్యేకంగా మీకోసం వస్తాము , అప్పుడు మీ ఉత్సాహాన్ని చూపించి , హోరెత్తిపోయేలా నినాదాలు ఇవ్వండి , కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం వద్దు’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అవ్వడం తో , అభిమానులు శాంతించారు.
Nirmala Sitharaman Speechని మధ్యలో Interrupt చేయడంతో.. Chandrababu Serious!
నేను, Pawan Kalyan ఎప్పుడూ వస్తూనే ఉంటాం..
కేంద్ర మంత్రి Message చాలా Important!
-@ncbn @PawanKalyan @nsitharaman https://t.co/lemb1kxciX
— M9 NEWS (@M9News_) October 2, 2026