Pawan Kalyan Tribal Village Visit: ప్రేమిస్తే పోయేది ఏముంది.. తిరిగి ప్రేమిస్తారు.. ఆ మధ్యన వచ్చిన తెలుగు సినిమాలు పవర్ ఫుల్ డైలాగ్ ఇది. అయితే ఇప్పుడు రాజకీయాల్లో దానిని అప్లై చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలను బెదిరించడం లేదు.. హెచ్చరించడం లేదు.. వారికి ప్రేమను పంచుతున్నారు. వారి పట్ల వాత్సల్యాన్ని చూపుతున్నారు. అన్నింటికీ మించి తాము ప్రజల కోసమే ఉన్నామన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నారు. వారితో మమేకమై పనిచేస్తున్నారు. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సామాన్య గిరిజనంతో జరుపుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జరుపుకుంటాయి. అయితే అవి మామూలుగా కాదు. ఎంతో అట్టహాసంగా జరుపుకుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ అలా భావించలేదు. ఆయన తలచుకుంటే విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి మహా నగరాల్లోనే ఆవిర్భావ సభలు జరుపుకోవాలని. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మారుమూల గిరిజన గ్రామంలో వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆశయం, స్ఫూర్తికి నిదర్శనం.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
* చాలా సింపుల్ గా ఆవిర్భావ దినం..
అల్లూరి జిల్లా పాడేరు లోని ఓ మారుమూల గిరిజన ఇన్స్టాగ్రామ్ ఓనూరులో గిరిజనుల సమక్షంలో జనసేన జెండా ఎగురవేసి.. నిరాడంబరంగా 13వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతకంటే ముందు గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఏజెన్సీ ని కలుపుతూ పెద్ద ఎత్తున రహదారులను నిర్మించారు. ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మారుమూల గిరిజన గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్డు వేయించారు. ఆ రోడ్డు నాణ్యతని పరిశీలించేందుకు గ్రామం వరకు కాలినడకన సాగుతూ దారిలో కనిపించిన గిరిజనులను పలకరిస్తూ.. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.
* గుర్తిస్తున్న గిరిజనులు..
గిరిజనం అనేది ఓటు బ్యాంకు రాజకీయానికి పనికొచ్చింది. గిరిజనుల ఓట్లను ఎలా కొల్లగొడదామా అన్న ఆలోచనలు ఇంతవరకు రాజకీయాలు చేస్తూ వచ్చారు పాలకులు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు. నిరంతరం గిరిజనుల కోసమే ఆలోచన చేస్తున్నారు. పోనీ ఓట్ల రాజకీయం కోసం అంటే ఏదో అన్నట్టు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ నిరాడంబరంగా తమతో కూర్చొని మాట్లాడడం.. తమ ప్రతి సమస్యను సావధానంగా విని.. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిస్తుండడానికి గిరిజనులు మరిచిపోలేకపోతున్నారు. ప్రజాదరణ పొందేందుకు భారీ సభలు.. అవసరమే లేదని.. ఇలా కూడా ప్రజల నుంచి అభిమానాన్ని పొందవచ్చు అని చేసి చూపించారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి సామాన్య ప్రజల కష్టాలు, సమస్యలు, కోరికలు పెద్దవి కావు. అలాగని వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేతలు లేరు. అయితే అటువంటి సమస్యలను తీర్చడం ప్రభుత్వాలకు కష్టం కాదని చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మాదిరిగా ఆలోచన చేస్తే ప్రజా సమస్యలు ఉండవన్నది ప్రజల భావన. ప్రజలను భయపెట్టి, వారిలో సెంటిమెంటును రగిలించి ఎంతకాలం రాజకీయం చేయగలరు. కొందరికి రాజకీయాలంటే వారసత్వం, పదవి వ్యామోహం.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు అని చేసి చూపించారు.
