Homeఅంతర్జాతీయంAli Khamenei: ఖమేనీ 30 ఏళ్ల ప్రస్తానం.. చివరకు విషాదాంతం!

Ali Khamenei: ఖమేనీ 30 ఏళ్ల ప్రస్తానం.. చివరకు విషాదాంతం!

Ali Khamenei: అమెరికా అనుకున్నది సాధించింది. రేజీమ్‌ చేంజ్‌ పేరుతో ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. అమెరికా–ఇజ్రాయిల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ మరణించారు. దీనిని ఇరాన్‌ ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త తీవ్ర ఉద్రిక్తతలు సృష్టించింది. ఈ సంఘటన మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ
ఫిబ్రవరి 28, 2026న టెహ్రాన్‌లోని ఖమేనీ నివాస భవనంపై ’ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో అమెరికా, ఇజ్రాయిల్‌ దాడి జరిగింది. ఆయన 86 సంవత్సరాల వయస్సులో మరణించారని ఇరాన్‌ మీడియా, ట్రంప్, ఇజ్రాయిల్‌ అధికారులు ధవీకరించారు. ఇది ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇనార్‌ అధికారిక టీవీలో మరణవార్త చదివిన యాంకర్‌ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటూ ట్రంప్‌కు ప్రతీకార హెచ్చరిక జారీ చేసింది. ‘ఇది ముగియలేదు, మీరు చరిత్రలో ఎన్నడూ లేనంత ధర చెల్లిస్తారు‘ అంటూ ప్రకటించారు. ఈ వీడియో వైరల్‌ అయింది.

30 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం..
1939 ఏప్రిల్‌ 19న మష్హద్‌లో పేద కుటుంబంలో ఖమేనీ జన్మించారు. షేఖ్‌ హాషెం ఖాజ్విని, అయతుల్లా మిలానీల వద్ద హవ్జా చదువుకున్నారు. 1960లలో షా పాలనకు వ్యతిరేకంగా 6సార్లు అరెస్టు, ఎక్సైల్‌ అనుభవించారు. 1979 విప్లవంలో ఖొమైనీ సహచరుడిగా కీలక పాత్ర.
ఖొమైనీ మరణం తర్వాత..
1981–89 మధ్య ఇరాన్‌ అధ్యక్షుడు. ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధంలో ఐఆర్‌జీసీతో సన్నిహితంగా పనిచేశారు. 1989 జూన్‌ 4న ఖొమైనీ మరణానంతరం రాజ్యాంగ సవరణతో సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. 60/74 ఓట్లతో గెలిచారు. సైన్యం, మీడియా, న్యాయవ్యవస్థపై పూర్తి నియంత్రణ పెట్టుకున్నారు.

పాలనా తీరు..
ఖమేని క్రమంగా ఒక నియంతలా మారాడు. తనకు వ్యతిరేకంగా జరిగే నిరసనలను అణచివేశారు. వేల మందికి ఉరిశిక్ష అమలు చేశారు. హోలోకాస్ట్‌ డినయల్, ఇజ్రాయిల్‌ వ్యతిరేకత ప్రసిద్ధి. 1981 దాడిలో పక్షవాతం, 2014 ప్రాస్టేట్‌ సర్జరీ, 2022 పొట్టకు చికిత్స చేశారు. సాధారణ జీవనం, కవిత్వం, తోటలు ఇష్టపడేవారు. మొజ్‌తబా అనే కుమారుడు ప్రభావవంతుడు.

భారత్‌లో ఆందోళన
శ్రీనగర్‌లో షియా ముస్లింలు భారీ ర్యాలీలు చేసి అమెరికా–ఇజ్రాయిల్‌పై నినాదాలు చేశారు. ఖమేనీకి మద్దతుగా ఐక్యత ప్రదర్శించారు. ఇలాంటి దాడులకు వారు వంగలోనికి పోరని ప్రకటించారు.

ఖమేనీ తర్వాత అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ వారసుడిని ఎన్నుకోవాలి. ఇరాన్‌లో నిరసనాలు, ఇంటర్నెట్‌ బ్లాక్‌ఔట్‌లు తీవ్రతరం అవుతున్నాయి. ట్రంప్‌ ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ అవకాశాలు పెరిగాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular