spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Politics: కులం, మతం, రాజధాని.. ఏపీలో రాజకీయం!

Andhra Pradesh Politics: కులం, మతం, రాజధాని.. ఏపీలో రాజకీయం!

Andhra Pradesh Politics: ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి చూస్తే.. వాటి మధ్య సారూప్యత కనిపిస్తోంది. కుల రాజకీయాలు కనిపిస్తున్నాయి. కుల సభలు పెరిగాయి. కులాల మధ్య, మతాల మధ్య విచ్చిన్నానికి ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ కేసు, గోదావరి జిల్లాలో కుల, మత వివాదాలు.. ఆపై జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్పష్టత.. ఇలా వీటన్నింటికీ సారూప్యత ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లి.. వైసిపి రాజకీయ లబ్ది పొందే ఆరాటంగా కనిపిస్తోంది.

* వైసీపీ దూకుడు..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గతం మాదిరిగా వ్యవహరిస్తోంది. ఒకవైపు కుల రాజకీయాలు, ఇంకోవైపు రాజధానిపై కుట్రలు, కొత్త ప్రతిపాదనలతో సిద్ధం అవుతోంది. కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది. అది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమోదంగా లేదు. పైగా ప్రభుత్వ వైఫల్యాలపై కంటే.. తమ పాత రాజకీయాన్ని పదును పెడుతోంది. కాపుల అంశంతో పాటు ఇతర సామాజిక వర్గాల ద్వారా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా రియాక్ట్ కావడం లేదు. దీంతో వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది.

* సాయి కృష్ణ కేసు..
సాయి కృష్ణ కేసుకు సంబంధించి చాలా ఆశించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎంతలా అంటే గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం లో లబ్ధి పొందే మాదిరిగా.. ఇదో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ఆశించింది. అందుకే నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. భారీ ఉద్యమానికి ప్లాన్ చేశారు. కానీ అదే సాయి కృష్ణకు నేరచరిత్ర ఉండడం.. చాలా తీవ్రమైన కేసులు నమోదు కావడం.. వైసిపి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కంటే.. తీవ్ర నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా చూపడంతో కాపు రాజకీయం వర్కౌట్ కాలేదు.

* మత ప్రాతిపదికన..
రఘురామకృష్ణం రాజుకు వ్యతిరేకంగా.. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు గోదావరి జిల్లాలో.. ఒక కులం మాటున.. మతం మాటున నిర్వహించిన సభ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బహిరంగ రహస్యం. ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పై ఘోరంగా మాట్లాడారు. వారందరిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. అయితే పబ్లిక్ లో దీనిపై రియాక్ట్ వేరేలా ఉంది. అటువంటి వారిని అరెస్టు చేయాలన్న డిమాండ్ వచ్చిన తర్వాతనే పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ మాది అంటూ తేల్చి చెప్పారు. ఇలా వరుస పరిణామాలు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించేందుకే ఈ గేమ్ ఆడుతోందని స్పష్టమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper