Homeఆంధ్రప్రదేశ్‌Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం.. రామ్మోహన్ నాయుడు కు ఆ ఛాన్స్ లేనట్టే!

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం.. రామ్మోహన్ నాయుడు కు ఆ ఛాన్స్ లేనట్టే!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభానికి కూత వేటు దూరంలో నిలిచింది. వచ్చే నెలలో ప్రారంభోత్సవం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రైవేటు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను జూలై 5 నుంచి ప్రారంభించనున్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేక ప్రకటన కూడా చేశాయి. ప్రస్తుతం చూస్తుంటే మాత్రం జూలైలో విమానాశ్రయం ప్రారంభం గ్యారెంటీ అని తేలిపోయింది.

* పౌర విమానయాన శాఖ మంత్రిగా కృషి..
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంలో.. ఉత్తరాంధ్రకు చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఉంది. గత రెండేళ్లుగా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను పరుగెత్తించారు. అందుకే పనులు చాలా వేగంగా కొనసాగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంతోనే చాలా వేగంగా పనులు జరిగాయి. ఇక్కడ విమాన రాకపోకలకు సంబంధించి ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. చివరిగా పెండింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.

* శాఖ మార్పు అనివార్యమా?
అయితే ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఆయన ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి కేంద్రంలో. రామ్మోహన్ నాయుడుకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ఆయన శాఖ మార్పు ఉంటుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది.

* విస్తరణకు కసరత్తు..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు నరేంద్ర మోడీ కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నెల 20న ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 18 తో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణలో కొత్తవారికి చోటుతోపాటు పాత వారి శాఖల కేటాయింపు ఉంటుందన్న టాక్ ఉంది. పౌర విమానయాన శాఖ నుంచి తప్పించి.. రామ్మోహన్ నాయుడుకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. అదే జరిగితే పౌర విమానయాన శాఖ మంత్రిగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో.. ప్రధాని తరువాత అదే స్థాయిలో గౌరవం దక్కాల్సిన రామ్మోహన్ నాయుడుకు ఆ ఛాన్స్ లేనట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper