Homeఆంధ్రప్రదేశ్‌Bhogapuram Airport: ఏపీలో ఈరోజు ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది

Bhogapuram Airport: ఏపీలో ఈరోజు ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది

Bhogapuram Airport: ఏపీలో( Andhra Pradesh) ఈరోజు ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరనుంది. చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. తొలి విమానం ఎయిర్పోర్టులో ల్యాండింగ్ కానుంది. ఉదయం 10:15 గంటలకు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగనుంది. ఢిల్లీ నుంచి ఈ విమానంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు ఆ విమానంలో చేరుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దశాబ్దాల ఉత్తరాంధ్ర ప్రజల కళ ఈరోజు నెరవేరనుంది.

* ప్రతిదీ ప్రత్యేకతే..
ఈ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలను చూస్తోంది జిఎంఆర్( GMR) సంస్థ. ఆ సంస్థ ప్రకటించిన ప్రకారం ఆదివారం ఉదయం 10:15 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రైల్ రన్ గా రన్ వే మీద దిగనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఈ విమానాశ్రయ నిర్మాణం 96% పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తుఫాన్లను తట్టుకునేలా ఈ ఎయిర్పోర్టును పటిష్టంగా నిర్మించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ విమానాశ్రయం చెక్కుచెదరదు. 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా.. ఎయిర్ పోర్టులో ఎక్కడా నీరు నిలవకుండా.. బయటకు వెళ్లి పోయేలా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* తొలి దశలో ఈ ప్రాజెక్టు పనుల కోసం రూ.4725 కోట్లు ఖర్చు చేశారు. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా తొలి విమానం ఈరోజు ల్యాండింగ్ కానుంది.
* మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభోత్సవం చేసేందుకు పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది.
* జూలై నుంచి ఈ విమానాశ్రయం నుంచి అధికారికంగా విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజుకు 200 విమానాలను నడిపే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం 20 వేల టన్నుల సరుకులను ఎగుమతి చేసే అవకాశం ఉంది.
* ఈ విమానాశ్రయంలో రాత్రి సమయంలో 18 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.
* ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో 33 శాతం విశాఖ నగరవాసులు కాగా.. మిగిలిన 67% మంది ఉత్తరాంధ్రవాసులు. ఆపై ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ ప్రజల రాకపోకలకు ఎయిర్పోర్ట్ అణువుగా ఉండనుంది.
* ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 14 ఇన్నిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
* విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల కోసం కూటమి ప్రభుత్వం మూడు ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తోంది.
* ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. టెర్మినల్ లోపల విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటికొప్పాక కళాకృతులను సైతం తీర్చిదిద్దారు.
* ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగేలా సౌకర్యాలు కల్పించడం విశేషం. ఇంటర్నేషనల్ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.
* ప్రపంచంలోనే పెద్ద విమానాలు అయిన ఎయిర్ బస్ A 380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా.. రన్ వేలను రూపొందించారు.
* తొలి దశలోనే 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యంతో టెర్మినల్ నిర్మించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular