Homeఆంధ్రప్రదేశ్‌AP DSC 2026: నారా లోకేష్ 2,721..ఇంకోసారి దగా డీఎస్సీ అనే మాట వస్తుందా?

AP DSC 2026: నారా లోకేష్ 2,721..ఇంకోసారి దగా డీఎస్సీ అనే మాట వస్తుందా?

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారిపోయాయి. డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో.. మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు.. నియామక ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలు మరొకవైపు.. ఇలా ఏపీలో డీఎస్సీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాత్ర.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసిపి వ్యక్తం చేస్తున్న […]

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారిపోయాయి. డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో.. మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు.. నియామక ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలు మరొకవైపు.. ఇలా ఏపీలో డీఎస్సీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాత్ర.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసిపి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి.

2721 పోస్టులు

ఏపీ రాజకీయాలలో డీఎస్సీ వ్యవహారం మరోసారి చర్చకు దారితీస్తోంది. గత మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆందోళనలు కొనసాగించింది. ఏకంగా దానికి దగా డిఎస్సీ అని పేరు పెట్టింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ విమర్శలను ఏమాత్రం లెక్క చేయలేదు. మరో డీఎస్సీ ప్రకటనతో ముందుకు వచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2026 షాట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ నవంబర్ మూడులోగా విడుదల చేస్తామని ప్రకటించారు.

గతంలో నిర్వహించిన డీఎస్సీలో అక్రమాల జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది. ప్రశ్న పత్రం లీకేజీ.. స్పోర్ట్స్ కూడా నియామకాలు.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అంశాలను లేవనెత్తింది ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని. మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇన్ని రకాలుగా ఆరోపణలు చేసినప్పటికీ వాటికి ఆధారాలు చూపించడంలో వైసిపి విఫలమైంది మరోవైపు నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించామని.. వైసిపి ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని కొనసాగిస్తుందని లోకేష్ అనేక సందర్భాలలో స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన అభ్యంతరాలు వాస్తవ దూరమని లోకేష్ కొట్టి పారేశారు.

ఇప్పుడు 2721 పోస్టులతో కొత్త డీఎస్సీ ప్రకటన రావడంతో రాజకీయంగా చర్చ మరో మలుపు తిరిగింది. గత నియామకాలపై వైసీపీ విమర్శలు చేస్తుంటే.. ప్రభుత్వ మాత్రం కొత్త ఉద్యోగాల భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది.. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజం. కానీ డీఎస్సీ కోసం ఏలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఉద్యోగాల భర్తీ.. నియామకాలలో పారదర్శకత.. న్యాయమైన ఎంపిక ప్రక్రియ ముఖ్యం. 2721 పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయపరమైన ఆందోళనలు చేసి.. కోర్టుకు వెళ్లి.. నియామక ప్రక్రియను అడ్డుకుంటే మాత్రం.. నిరుద్యోగుల నుంచి వైసిపి మరోసారి నిరసన ఎదుర్కొక తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper