Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Session: లిక్డ్‌ ఇన్‌లో ఏపీసీఎం.. ప్రమాణ స్వీకారం తర్వాత బాబు చేసిన పని...

AP Assembly Session: లిక్డ్‌ ఇన్‌లో ఏపీసీఎం.. ప్రమాణ స్వీకారం తర్వాత బాబు చేసిన పని వైరల్

AP Assembly Session: ఏపీకి నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. తాజాగా ఆయన లింక్‌డ్ ఇన్‌ ఖాతాపై ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. ఏసీపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆయన బయో అప్‌డేట్ చేశారు. బిజినెస్ , ఎంప్లాయిమెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్‌డ్‌ ఇన్‌లోలో ఆయన చేసిన ఓ పోస్టుపై మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్‌‍్సలో వైరల్‌ అవుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది. టెక్నాలజీని వాడటంలో, ప్రోత్సహించడంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడి సృష్టించే చంద్రబాబు ఈసారి కూడా తన పోస్టును అదే రీతిలో చేశారు.

లింక్‌డ్‌​ఇన్‌ ప్రొఫైల్‌పై చర్చ..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకుడు జూన్‌ 12న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ అప్‌డేట్ చేశారు. అలాగే తన లింక్‌డ్‌ ఇన్‌లో మాత్రం ఓ పోస్టు పెట్టారు. ‘ఇటీవల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి 164 స్థానాలు సాధించిందని ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆ పోస్టులో పేర్కొన్నారు. తమ మూడు పార్టీల కూటమిలో ప్రజలు నాలుగో పార్టీగా చేరారని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాల్సిన బాధ్యత తమపై ఉంది.. అందుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తాం’ అని ఆయన రాసుకున్నారు.

ఎక్స్‌లో షేర్ చేసిన మహిళ
చంద్రబాబు నాయడు లింక్‌డ్‌ ఇన్‌లో రాసుకున్న పోస్టును రాధికా ధని అనే ఓ టెకీ.. ఎక్స్‌లో పోస్టు చేశారు. చంద్రబాబు తన ప్రొఫైల్ నెట్‌వర్కింగ్ చేస్తున్నట్లు లేదని తన రెస్యూమ్‌ అప్‌డేట్ చేసినట్లు ఉందని ఆమె వ్యాఖ్య చేశారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై చాలా మంది టెకీలు స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు 1995 నుంచి హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చేస్తున్నారని.. ఆయన్ను ఏపీ సీఎం అని కాకుండా సీఈవో అని పిలుచుకుంటారని కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చిన అవార్డులు, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల్లో వచ్చిన కవరేజ్ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పోస్ట్ 2.70 లక్షల మంది చూశారు.

లింక్‌డ్‌ ఇన్‌ వినియోగం తక్కువ..
రాజకీయ నాయకులు సహజంగా ఎక్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటివి వాడుతుంటారు. లింక్‌డ్‌ ఇన్‌ లాంటి ప్రొఫెషనల్ వేదికలు ఉపయోగించడం తక్కువ. బిజినెస్ ప్రొఫెషనల్స్, టెక్ సంబంధిత వ్యక్తులు మాత్రమే లింక్‌డ్‌ ఇన్‌లో ఉంటారు. ఉద్యోగార్థులు ఎక్కువగా దీనిని వాడుతుంటారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యేవారు. విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సులూ నిర్వహించారు. ఎక్కువ మంది బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం కోసం ఆయన లింక్‌డ్‌ ఇన్ వాడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper