Homeవింతలు-విశేషాలుKothagudem: పాములకు ఆవాసం ఆ ఇల్లు.. చివరికి ఏం చేశారో తెలుసా?

Kothagudem: పాములకు ఆవాసం ఆ ఇల్లు.. చివరికి ఏం చేశారో తెలుసా?

Kothagudem: ఒక్క పాము కనిపిస్తేనే మనం ఆమడ దూరం పరిగెత్తుతాం.. ఇక కుప్పలు కుప్పలుగా పాములు కనిపిస్తే మన పరిస్థితి ఏంటి ?భయంతో గజగజ వణకాల్సిందే . అటువంటి పరిస్థితి ఎదురైంది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఓ ఇంటి యజమానికి. అయితే అతను ఆ పాముల గుంపును ఏమీ చేయకపోగా రక్షించాడు.

ఏం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు రాజు. ఇటీవల తన ఇంట్లో ఒక చిన్న రంద్రం గమనించాడు. అయితే చూసేందుకు చిన్న రంధ్రం ఉండగా అందులో కప్పలు ఉంటాయని మొదటగా భావించారు. అయితే అందులో నుంచి ఒక్కొక్కటిగా పాములు బయటికి రావడంతో భయాందోళనకు గురయ్యారు రాజు కుటుంబ సభ్యులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 32 పాములు రంధ్రం గుండా బయటకు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు వాటిని ఏమీ అనకుండా పాములు పట్టే దత్తుకు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం పాము పిల్లలను చాకచక్యంగా పట్టుకున్నాడు. డబ్బాలో బంధించారు.

బుసలు కొట్టిన సర్పాలు..
ఈ పాములను పట్టుకునే సమయంలో అవి బుసలు కొట్టడంతో అక్కడున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్‌ క్యాచర్‌ దత్తు మాట్లాడుతూ చిన్న రంధ్రాల గుండా కూడా పాములు దూరగలవని తెలిపాడు. వర్షాకాలం నేపథ్యంలో ప్రనజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.

తరలి వచ్చిన స్థానికులు..
ఇక రాజు ఇంట్లో 32 పాములు ఉన్నాయని తెలియడంతో చుట్టుపక్కలవారు తరలివచ్చారు. పాములు మనుషులను పసిగట్టవని తెలిపాడు. రాజు ఇంట్లో పాము పిల్లలు చేసిందని, అవి ఒక్కసారిగా బయటకు రావడంతో బుసలు కొట్టాయని వెల్లడించారు. పాములను చాకచక్యంగా పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌ దత్తు టీంను స్థానికులు అభినందించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular