Anand Mahindra praises Nara Lokesh: రాజకీయలు వేరు.. దీర్ఘకాలం పనికి వచ్చే అభివృద్ధి వేరు. ఈ రెండిట్లో ఏది కావాలంటే రెండవ దానికే ఓటు వేస్తారు ఏపీ మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ ఉన్నత విద్యావంతుడు. అంతకుమించి పెట్టుబడులు తీసుకురాగల ఘనాపాటి. అందువల్లే గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ నుంచి మొదలు పెడితే టి సి ఎస్ వరకు పెద్ద పెద్ద సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.
నారా లోకేష్ లో లౌక్యం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా సరే ఎదుటి వ్యక్తులను ఒప్పించగల నేర్పరితనం ఆయనలో ఉంటుంది. అందువల్లే కార్పొరేట్ సంస్థలు ఏపీకి ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఏకంగా క్వాంటం వ్యాలీకి క్యాపిటల్గా మారిపోయింది. కేవలం రెండున్నర సంవత్సరాలలోనే ఇంతటి ఘనత సాధ్యమైంది. దీని అంతటికి కర్త కర్మ క్రియ మొత్తం నారా లోకేష్ అని చెప్పక తప్పదు.
నారా లోకేష్ సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. ఏ విషయమైనా సరే పంచుకుంటారు. ఇటీవల నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా గుంటూరు జిల్లాలో మిర్చి పంటకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక ట్రైన్ వేగంగా వెళుతూ ఉంటుంది. అటు ఇటు విస్తారంగా మిరప పంట ఆరబోసి ఉంది. మిరప తోటలు కూడా విస్తారంగా ఉన్నాయి. ఈ వీడియో చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఎర్ర బంగారం మధ్యలో నుంచి ట్రైన్ వెళ్లడం గొప్ప అనుభూతిగా ఉంది.
Also Read: తెలంగాణ సన్నబియ్యం.. ఆంధ్రాకు.. ఇదో పెద్ద స్కాం!
నారా లోకేష్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత దీనిపై దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. వీడియో అద్భుతంగా ఉందని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనిపై కందుల దుర్గేష్ తో మాట్లాడుతామని.. పర్యటకంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. అయితే ఇక్కడే నారా లోకేష్ తన లౌక్యాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తు కాలంలో ఏపీలో మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్ పార్కులను కూడా ఇలాంటి డ్రోన్ కెమెరాల ద్వారా రూపొందించిన వీడియోలో చూడాలని ఉందని లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ అకస్మాత్తుగా తనలో ఉన్న ఈ మాటను బయట పెట్టడంతో ఆనంద్ మహీంద్రా కూడా సానుకూలంగా స్పందించారు.
భవిష్యత్ కాలంలో ఏపీలో మహీంద్రా కంపెనీ ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్ పార్కులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటి ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సమాచారం. మహేంద్ర కంపెనీ ఇప్పటికే విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలు సాగిస్తోంది. సత్యం కంపెనీని టేకోవర్ చేసుకున్న తర్వాత మహీంద్రా ఐటీ కార్యకలాపాలను వేగవంతం చేసింది. హైదరాబాదులో టెక్ మహీంద్రా పేరుతో అతిపెద్ద ఐటీ కంపెనీని నిర్వహిస్తోంది.
Thank you Anand ji, for your thoughtful suggestion. I will request our tourism minister @kanduladurgesh to explore ways to enhance the tourism potential of this colorful sight. What you see from the sky is the result of thousands of farmers’ hard work and a tradition that has… https://t.co/hee6Scn4uv
— Lokesh Nara (@naralokesh) March 4, 2026